IPL 2021 - MI Vs DC : అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్ అదుర్స్.. ముంబై బెదుర్స్.. టార్గెట్ ఎంతంటే..

IPL 2021 - MI Vs DC

IPL 2021 - MI Vs DC : కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చేతులేత్తేశారు. యంగ్ గన్స్ అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్ ల బౌలింగ్ ముందు తేలిపోయారు.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021 Season Latest Updates) లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బ్యాటర్లు నిరాశపర్చారు. పరుగులు చేయడానికి ఆ జట్టు ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు. ఢిల్లీ బౌలర్ల జోరు ముందు స్లో పిచ్ పై పరుగులు చేయలేక ఢిల్లీ ముందు సాధారణ టార్గెట్ ను ఉంచారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఢిల్లీ టార్గెట్ 130 పరుగులు. సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులే అత్యధిక స్కోరు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ లు చెరో మూడు వికెట్లుతో ముంబై జోరుకు బ్రేకులు వేశారు. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలవడం వారికి ఎంతో కీలకం. ఈ మ్యాచ్ లో ఓడిపోతే. .వారి అవకాశాలు సన్నగిల్లుతాయ్.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపు డికాక్, సూర్య కుమార్ యాదవ్ ఆచి తూచి పరుగులు చేశారు. అయితే, 19 పరుగులు చేసిన డికాక్. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో నార్ట్జేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండు సిక్సర్లు కొట్టి టచ్ లో కన్పించిన సూర్యకుమార్ యాదవ్ అనవసరపు షాట్ కు యత్నించి ఔటయ్యాడు.

    సూర్య కుమార్ (33 పరుగులు, 26 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 68 పరుగుల వద్ద వెనుదిరిగాడు. సౌరభ్ తివారి (15) రూపంలో ముంబై ఇండియన్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 80 పరుగుల వద్ద వెనుదిరిగాడు.


    పొలార్డ్ (6 రన్స్ ) రూపంలో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నార్ట్జే బౌలింగ్‌లో టీం స్కోర్ 87 పరుగుల వద్ద బౌల్డయ్యాడు. ఇక, ఆఖర్లో వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించిన హార్దిక్ పాండ్యా 17 పరుగులు చేసి.. అవేశ్ ఖాన్ అద్భుతమైన డెలివరీకి ఔటయ్యాడు. ఆఖర్లో జయంత్ యాదవ్ 4 బంతుల్లో 11 పరుగులు చేయడంతో ముంబై ఇండియన్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

    తుది జట్లు :

    ముంబై ఇండియన్స్
    రోహిత్‌ శర్మ (కెఫైన్), క్వింటన్ డికాక్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరభ్‌ తివారీ, హార్ధిక్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్ పాండ్యా, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, జయంత్ యాదవ్ , జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌.

    ఢిల్లీ క్యాపిటల్స్‌:
    శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, స్టీవ్‌ స్మిత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), షీమ్రాన్‌ హెట్మయర్‌, ఆక్సర్‌ పటేల్‌, అశ్విన్‌, కగిసో రబడా, అన్రిన్‌ నార్ట్జే/అమిత్‌ మిశ్రా, అన్వేష్‌ ఖాన్‌.
    Published by:Sridhar Reddy
    First published: