IPL 2021 Today Match : బిగ్ ఫైట్ కి ముంబై, ఢిల్లీ రెడీ.. టాస్ గెలిచిన పంత్.. రెండు జట్లలో మార్పులివే..

IPL 2021 - MI Vs DC

IPL 2021 Today Match : షార్జా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ముంబైపైనే ఉంది. ఎందుకంటే ఎప్పుడూ అందరికంటే ముందుగానే ప్లే ఆఫ్స్‌ చేరే ముంబై.. ఈసారి మాత్రం పాయింట్ల జాబితాలో ఇప్పటికీ ఆరో స్థానంలో ఉంది. ఇకపై ఆడే మూడు మ్యాచులు గెలిస్తేనే ముంబై ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది.

 • Share this:
  ఐపీఎల్ 2021 (IPL 2021 Season Latest Updates) సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేస్ బరిలో నిలవడానికి ప్రతి జట్టు పోరాడతుండటంతో ఫ్యాన్స్ కావాల్సినంత మజా అందిస్తోంది. కాసేపట్లో మరో కీలక పోరుకు ఐపీఎల్ రెడీ అయింది. ఇవాళ డబుల్ ధమాకాలో భాగంగా మొదటి మ్యాచులో ముంబై ఇండియన్స్​ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్లు తలపడుతున్నాయి. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక, లలిత్ యాదవ్ ప్లేస్ లో పృథ్వీ షా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక, ముంబై ఇండియన్స్ కూడా ఒక మార్పు చేసింది. స్పిన్నర్ రాహుల్ చాహర్ ప్లేస్ లో జయంత్ యాదవ్ కు చోటు కల్పించింది. షార్జా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ముంబైపైనే ఉంది. ఎందుకంటే ఎప్పుడూ అందరికంటే ముందుగానే ప్లే ఆఫ్స్‌ చేరే ముంబై.. ఈసారి మాత్రం పాయింట్ల జాబితాలో ఇప్పటికీ ఆరో స్థానంలో ఉంది. ఇకపై ఆడే మూడు మ్యాచులు గెలిస్తేనే ముంబై ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది. మరోవైపు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలుపొంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  ఐపీఎల్ 2021లో వరుస ఓటములతో సతమతమవుతోన్న ముంబై ఇండియన్స్​ గత మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​పై గెలిచి ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్​లో ముంబై బ్యాటింగ్​లో దారుణంగా విఫలమవుతోంది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, రోహిత్ శర్మలు సరైన ఆరంభాలు ఇవ్వట్లేదు. ఒకరు మెరిస్తే.. మరొకరు త్వరగానే ఔట్ అవుతున్నారు. దీంతో ఈ జోడీపై ముంబై టీమ్ చాలా ఆశలు పెట్టుకుంది.


  ఇక బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా రాణిస్తున్నా.. ట్రెంట్ బోల్ట్ భారీగా పరుగులు ఇస్తున్నాడు. ఈ జోడి గతంలోగా రాణించట్లేదు. ఈ ఇద్దరు రాణిస్తే ముంబైకు తిరుగుండదు. స్పిన్ విభాగం కూడా విఫలమవుతోంది. షార్జా పిచ్​ కాస్త స్లోగా ఉంటుంది కాబట్టి రాహుల్ చహర్, కృనాల్ పాండ్యా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.

  మరోవైపు, ఢిల్లీ బ్యాటింగ్ లో శిఖర్ ధావన్ ఫామ్ లో ఉన్నాడు. గత మ్యాచ్ లో జట్టులోకి వచ్చి స్టీవ్ స్మిత్ కూడా స్లో పిచ్ కు తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడు. రిషబ్ పంత్ ఫర్వాలేదనిపిస్తున్నా.. దూకుడుగా మాత్రం ఆడలేకపోతున్నాడు. శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్ లో విఫలమయ్యాడు. అతడు రాణించాల్సినా అవసరం ఉంది. హెట్ మేయర్ దూకుడుగా ఆడితేనే.. ఢిల్లీ భారీ స్కోరు చేయగలదు.

  తుది జట్లు :

  ముంబై ఇండియన్స్
  రోహిత్‌ శర్మ (కెఫైన్), క్వింటన్ డికాక్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరభ్‌ తివారీ, హార్ధిక్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్ పాండ్యా, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, జయంత్ యాదవ్ , జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌.

  ఢిల్లీ క్యాపిటల్స్‌:
  శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, స్టీవ్‌ స్మిత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), షీమ్రాన్‌ హెట్మయర్‌, ఆక్సర్‌ పటేల్‌, అశ్విన్‌, కగిసో రబడా, అన్రిన్‌ నార్ట్జే/అమిత్‌ మిశ్రా, అన్వేష్‌ ఖాన్‌.
  Published by:Sridhar Reddy
  First published: