Home /News /sports /

IPL 2021 LIVE UPDATES PBKS VS MI PUNJAB KINGS WON THE TOSS AND OPT TO BOWL FIRST SRD

PBKS vs MI : అందరి కళ్లు కృనాల్ , దీపక్ హుడాలపైనే.. టాస్ గెలిచిన పంజాబ్..

PBKS vs MI : అందరి కళ్లు కృనాల్ , దీపక్ హుడాలపైనే.. టాస్ గెలిచిన పంజాబ్..

PBKS vs MI : అందరి కళ్లు కృనాల్ , దీపక్ హుడాలపైనే.. టాస్ గెలిచిన పంజాబ్..

PBKS vs MI : రెండు జట్లలో టాప్ ప్లేయర్స్ ఉన్నారు. క్షణాల్లో ఆటను మార్చగల ధీరులు ఉన్నారు. అయినా ఏం ప్రయోజనం తమ జట్లను గెలిపించలేక చతికిలపడుతున్నారు. ఆ రెండు జట్లే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్. ఇవాళ జరగనున్న పోరు ఈ రెండు జట్లకు కీలకం.

ఇంకా చదవండి ...
  ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ కాసేపట్లో జరగనుంది. చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్ తో తలపడనుంది పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై చిత్తుగా ఓడగా.. సన్‌రైజర్స్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో హోరాహోరీ పోరు ఖాయమనిపిస్తోంది. గత సీజన్‌లో సూపర్ ఓవర్స్ థ్రిల్లింగ్ అందించిన ఈ జట్లు ఈ సీజన్‌లో ఏం చేస్తాయో చూడాలి. ఇక కృనాల్ పాండ్యా- దీపక్ హుడా మధ్య ఉండే పోరుపై సర్వత్రా ఆసక్తినెలకొంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముందు ఈ ఇద్దరు గొడవపడటం.. దీపక్ హుడా బరోడా టీమ్‌ నుంచి వేటుకు గురవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో తన ఫస్ట్ ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే దంచికొట్టిన దీపక్ హుడా.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతాడో చూడాలి. ముఖ్యంగా కృనాల్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటాడనే ఆతృత అందరిలో నెలకొంది.టోర్నీని విజయంతో మొదలుపెట్టిన పంజాబ్ గత మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ను కాపాడుకోలేకపోయిన పంజాబ్.. చెన్నై, సన్‌రైజర్స్‌తో జరిగిన పోటీల్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మంచి ఆరంభాలు ఇస్తున్నా క్రిస్ గేల్, నికోలస్ పూరన్ వైఫల్యం పంజాబ్‌ను బాగా దెబ్బతీస్తోంది. దీపక్‌హుడా టచ్‌లో ఉండగా షారుఖ్ ఖాన్ బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నాడు. పంజాబ్ బౌలింగ్ యూనిట్ చాలా వీక్‌గా ఉంది. మహ్మద్ షమీ నేతృత్వంలోని బౌలర్లు అస్సలు ప్రభావం చూపలేకపోతున్నారు.

  ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలంటే డిఫెండింగ్ చాంపియన్ ముంబై తమ బ్యాటింగ్ సమస్యను పరిష్కరించుకుని తీరాలి. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇతర బ్యాట్స్‌మెన్ నిలకడగా పెర్ఫామ్ చేయడం లేదు. అడపాదడపా మెరిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా కూడా సత్తా చూపెట్టాల్సి ఉంది. లేదంటే ఢిల్లీ మ్యాచ్ ఫలితం రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు బౌలింగ్ యూనిట్ నిలకడగా రాణిస్తోన్న.. అవసరమైన సమయంలో చేతులేత్తేస్తోంది.

  ఐపీఎల్‌లో ఈ ఇరు జల్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడగా.. 14 విజయాలతో ముంబైనే పై చేయిసాధించింది. పంజాబ్ 12 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. గత రెండు సీజన్లలో మాత్రం ఇరు జట్లు చెరొక విజయాన్నందుకున్నాయి.

  తుది జట్లు :

  Mumbai Indians (Playing XI): Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Ishan Kishan, Hardik Pandya, Krunal Pandya, Kieron Pollard, Jayant Yadav, Rahul Chahar, Jasprit Bumrah, Trent Boult


   Punjab Kings (Playing XI): KL Rahul(w/c), Mayank Agarwal, Chris Gayle, Nicholas Pooran, Deepak Hooda, Moises Henriques, Shahrukh Khan, Fabian Allen, Mohammed Shami, Ravi Bishnoi, Arshdeep Singh


  Published by:Sridhar Reddy
  First published:

  Tags: IPL 2021, KL Rahul, Mumbai Indians, Punjab kings, Rohit sharma

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు