IPL 2021 LIVE UPDATES PBKS VS MI MUMBAI INDIANS SETS NORMAL TARGET SRD
PBKS vs MI : ఓన్లీ రోహిత్ శర్మ షో.. రాణించిన పంజాబ్ బౌలర్లు.. PBKS టార్గెట్ ఎంతంటే..
PBKS vs MI
PBKS vs MI : రెండు జట్లలో టాప్ ప్లేయర్స్ ఉన్నారు. క్షణాల్లో ఆటను మార్చగల ధీరులు ఉన్నారు. అయినా ఏం ప్రయోజనం తమ జట్లను గెలిపించలేక చతికిలపడుతున్నారు. ఆ రెండు జట్లే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్. ఇవాళ జరగనున్న పోరు ఈ రెండు జట్లకు కీలకం.
మరోసారి ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ నిరాశపర్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప మిగతా బ్యాట్స్ మన్ విఫలమయ్యారు. దీంతో మరోసారి తక్కువ టార్గెట్ కే పరిమితమైంది ముంబై. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ 52 బంతుల్లో 63 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో షమీ, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఫస్ట్ ఆరు ఓవర్లలో స్కోరు చేయడానికే నానా తంటాలు పడింది. రెండో ఓవర్ లోనే ఆ జట్టుకు షాక్ తగిలింది. ప్రస్తుత సీజన్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న డికాక్(5 బంతుల్లో 3 )మరోసారి నిరాశపరిచాడు. దీపక్ హూడా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో మిడాన్‌లో ఉన్న హెన్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. పవర్ ప్లే ముగిసే సరి ముంబై ఇండియన్స్ వికెట్ కోల్పోయి కేవలం 21 పరుగులు మాత్రం చేసింది. ఆ తర్వాత రవి బిష్ణోయి వేసిన 7వ ఓవర్ ఆఖరి బంతికి ఇషాన్ కిషన్(17 బంతుల్లో 6) ఔటయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డ ఇషాన్...బిష్ణోయి బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఇక ఆ తర్వాత.. రోహిత్, సూర్య కుమార్ యాదవ్ షో మొదలైంది. ఆచితూచి ఆడుతూనే.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే రోహిత్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఐపీఎల్లో 40వ ఫిఫ్టీని నమోదు చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్. 79 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్, సూర్యకుమార్ ల జోడిని రవి బిష్ణోయ్ విడదీశాడు.
27 బంతుల్లో 33 పరుగులు చేసి మంచి టచ్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ ని పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత వెంటనే రోహిత్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. షమీ బౌలింగ్ లో భారీ షాట్ కి ప్రయత్నించి బౌండరీ మీద చిక్కాడు హిట్ మ్యాన్. ఆ వెంటనే హార్దిక్ కూడా ఔటయ్యాడు. ఈ సీజన్ లో తన పేలవ ఫామ్ ను కొనసాగుతూనే ఉంది. ఆఖర్లో పొలార్డ్, కృనాల్ ప్రయత్నించినా ముంబై తక్కువ టార్గెట్ కే పరిమితమైంది.
ఐపీఎల్లో ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడగా.. 14 విజయాలతో ముంబైనే పై చేయిసాధించింది. పంజాబ్ 12 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. గత రెండు సీజన్లలో మాత్రం ఇరు జట్లు చెరొక విజయాన్నందుకున్నాయి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.