Home /News /sports /

IPL 2021 - KKR Vs SRH: విఫలమైన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..?

IPL 2021 - KKR Vs SRH: విఫలమైన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..?

(Image-Twitter/IPL)

(Image-Twitter/IPL)

ఐపీఎల్ 2021 (IPL 2021)‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న రెండో మ్యాచ్‌లో సన్ రైడర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.

    ఐపీఎల్ 2021 (IPL 2021)‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న రెండో మ్యాచ్‌లో సన్ రైడర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం కోసం కోల్‌కతా జట్టు 116 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. టిమ్ సౌథి మొదటి ఓవర్ రెండో బంతికే సన్ రైజర్స్ ఓపెనర్ వృద్దిమాన్ సాహా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సన్ రైజర్స్ సారథి కేన్ విలియమ్సర్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే జాసన్ రాయ్(10) శివమ్ మావి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే ఆరో ఓవర్‌లో నాలుగు ఫోర్లతో విలియమ్సన్ చెలరేగాడు. అయితే ఆ తర్వాతి ఓవర్‌లోనే షకీబ్ బౌలింగ్‌లో పరుగు తీసేందుకు యత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో 7 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ కష్టాల్లో పడింది.

    ఆ తర్వాత 11 ఓవర్‌లో అభిషేక్ శర్మ పెవిలియన్‌కు చేరాడు. నెమ్మదిగా ఆడుతూ వచ్చిన ప్రియమ్ గార్గ్ వరుణ్ చక్రవర్తి వేసిన 15వ ఓవర్ రెండో బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జాసన్ హోల్డర్(2).. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత 25 పరుగుల చేసిన అబ్దుల్ సమద్ టిమ్ సౌథీ వేసిన 18 ఓవర్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రషీద్ ఖాన్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.

    ఇక, ఈ సీరిస్‌లో సన్ రైజర్స్ జట్టు పేవలమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతూ వస్తోంది. అయితే కోల్‌కత్తాకు మాత్రం KKRకి ప్రతి మ్యాచ్ ఇప్పుడు డూ ఆర్ డై లాంటిదే. 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న కోల్ కతా.. తాడో పేడో తేల్చుకోని.. ప్లే ఆఫ్ రేస్ లో స్ట్రాంగ్ గా నిలవాలని చూస్తోంది.



    హెడ్ టు హెడ్ రికార్డులు :
    ఇక, హెడ్ టు హెడ్ రికార్డులు కోల్ కతా కే అనుకూలం గా ఉన్నాయ్. కోల్ కతా 13 మ్యాచ్ ల్లో గెలిస్తే.. హైదరాబాద్ కేవలం 7 మ్యాచ్ ల్లో మాత్రమే నెగ్గింది.

    తుది జట్లు :
    కోల్ కతా నైట్ రైడర్స్ : శుభ్ మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ ( కెప్టెన్), నితీశ్ రానా, దినేశ్ కార్తీక్, షకీబ్ ఉల్ హసన్, సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి.

    సన్ రైజర్స్ హైదరాబాద్ : జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ వర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్ద్ కౌల్, ఉమ్రన్ మాలిక్.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Kolkata Knight Riders, SRH, Sunrisers Hyderabad

    తదుపరి వార్తలు