Home /News /sports /

IPL 2021 - SRH Vs CSK: సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. చివరి ఓవర్ వరకు సాగిన మ్యాచ్..

IPL 2021 - SRH Vs CSK: సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. చివరి ఓవర్ వరకు సాగిన మ్యాచ్..

(Image Credit-IPL)

(Image Credit-IPL)

ఐపీఎల్ 2021‌లో(IPL 2021) వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ .. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం సన్ ‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    ఐపీఎల్ 2021‌లో(IPL 2021) వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) .. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం సన్ ‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ జట్టు నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని.. చెన్నై జట్టు 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. తొలుత ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చైన్నె సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక వృద్దిమాన్ సాహా మినహా మిగిలిన ఆటగాళ్లు ఎవరూ కనీసం 20 పరుగుల స్కోర్ కూడా చేయలేకపోయారు. సన్ ‌రైజర్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. దూకుడుగా ఆడింది. అయితే 14 ఓవర్ తర్వాత వెంట వెంటనే మెయిన్ ఆలీ, రైనా, డు ప్లెసిస్ పెవిలియన్ చేరడంతో.. చెన్నై స్కోర్ బోర్డు నెమ్మదించింది. చివరకు కెప్టెన్ ఎంఎస్ ధోని, అంబటి రాయుడులు చెన్నైని విజయతీరాలకు చేర్చారు.

    ఇక, చెన్నై ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్ తొలి మూడు ఓవర్లలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. మూడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై జట్టు 12 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత ఓపెనర్లు దూకుడుగా ఆడటంతో చెన్నై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 10 ఓవర్లకు చెన్నై స్కోర్ 75కు చేరింది. అయితే 11 ఓవర్ తొలి బంతికి జాసన్ హోల్డర్ బౌలింగ్ రుతురాజ్ గైక్వాడ్(450 పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మోయిన్ అలీ  చెన్నై స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. 15వ ఓవర్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మెయిన్ అలీ(17) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే అభిమానులను నిరాశ పరిచాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

    ఆ తర్వాత కొద్దిసేపటికే డెప్లెసిస్ (41) కూడా అవుట్ అయ్యాడు. అనంతరం కెప్టెన్ ధోని, అంబటి రాయుడు నెమ్మదిగా ఆడుతూనే వీలు దొరికినప్పుడు బౌండరీలు సాధించారు. డాట్ బాల్స్‌తో సన్ రైజర్స్ బౌలర్స్.. చెన్నై బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడంతో.. చివరి ఓవర్‌ వరకు మ్యాచ్ సాగింది. చివరి ఓవర్‌లో నాలుగో బంతికి సిక్సర్‌తో ధోని బాది, చెన్నైని విజయ తీరాలకు తీర్చాడు. ధోని 14, రాయుడు 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 19.4 ఓవర్లలో చెన్నై జట్టు 4 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో హోల్డర్ 3, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.

    అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. నాలుగో ఓవర్‌లో  ఓపెనర్ జాసన్ రాయ్(2).. జోష్‌ హేజి‌ల్‌వుడ్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్స్ సారథి కేన్ విలియమ్సన్(11) కొద్దిసేపటికే పెవిలియన్ చేరాడు. ప్రియమ్ గార్గ్(7) కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత ఓపెనర్ వృద్దిమాన్ సాహా కూడా అవుట్ కావడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ (Abhishek Sharma), అబ్దుల్ సమద్‌లు (Abdul Samad) ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

    అయితే 17 ఓవర్‌లో హేజి‌ల్‌వుడ్‌ వేసిన మూడో బంతికి అభిషేక్ శర్మ(18) అవుట్ అవ్వగా.. ఐదో బంతికి 18 పరుగులు చేసిన సమద్ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 19 ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్(5) అవుట్ అయ్యాడు. చివర్లో బ్యాటింగ్‌ వచ్చిన రషీద్‌ ఖాన్‌ (17), భువనేశ్వర్‌ (2) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు.. 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ వృద్ధిమాన్ సాహా (44) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో హేజిల్ వుడ్‌ 3, బ్రావో 2 వికెట్లు తీసుకోగా.. శార్ధూల్‌ ఠాకూర్‌, జడేజా చెరో వికెట్ తీశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Chennai Super Kings, IPL 2021, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు