• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 LIVE SCORE CSK VS DC SURESH RAINA HALF CENTURY DELHI TARGET SA

CSK Vs DC: మెరిసిన రైనా.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే!

CSK Vs DC: మెరిసిన రైనా.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే!

రైనా(ఫైల్ ఫొటో)

ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగతుంది. చెన్నైభారీ స్కోర్ సాధించింది. నిర్ణత 20 ఓవర్లో 188 పరుగులు చేసింది.

  • Share this:
    ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగతుంది. మెుదట బ్యాటింగ్ చేసిన  చెన్నైభారీ స్కోర్ సాధించింది. నిర్ణత 20 ఓవర్లో 188 పరుగులు చేసింది. రైనా(54) తన మెుదటి మ్యాచ్ హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఆదరగొట్టాడు. మెుదటిగా టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డీండ్ ఎంచుకుంది. చెన్నై ఇన్నింగ్స్‌ను డుప్లెసిస్‌, గైక్వాడ్‌లు ఆరంభించారు. ఢిల్లీ తరుపున తొలి ఓవర్‌ను క్రిస్‌ వోక్స్‌ ప్రారంభించాడు. ఆరంభంలోనే చెన్నైకి ఎదురుదెబ్బ తగిలింది.

    ఆవేశ్‌ ఖాన్‌ వేసిన రెండో ఓవర్లో డుప్లెసిస్‌(0) ఎల్బీగా వెనుదిరిగాడు. మొయిన్‌ అలీ బ్యాటింగ్‌కు దిగాడు. ఆ తర్వాత వోక్స్‌ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికే గైక్వాడ్‌ ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్‌ప్లేలోనే సీఎస్‌కే రెండు వికెట్లు కోల్పోవడంతో చెన్నై శిబిరంలో కొంత ఆందోళన కనిపించింది. అనంతరం సురేశ్‌ రైనా,మొయిన్‌ అలీ భారీ షాట్లతో విరుచుపడ్డారు. రవిచంద్రన్ అశ్వీన్ వేసిన 5 ఓవర్‌లో రైనా రెండు ఫోర్లు కొట్టి హిట్టింగ్ ప్రారంభించాడు. 5 ఓవర్లకు చెన్నై 30/2 పరుగులు చేసింది. అశ్విన్‌ వేసిన 7,9 ఓవర్లో మొయిన్‌ అలీ రెండు ఫోర్లు
    రెండు సిక్సర్లు బాది చెన్నై ఇన్నింగ్స్‌ను పరుగుల పెట్టించారు. ఆ తర్వాత మరో సిక్స్ కొట్టే ప్రయత్నంలో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత రైనా అంబటి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.

    ఆ తర్వాత భారీ షాట్‌కు యత్నించిన అంబటి రాయుడు  ధావన్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. డబుల్‌ తీసే ప్రయత్నంలో రైనా రనౌట్‌గా కాగా ధోనీ తను ఎదుర్కొన్న రెండో బంతికే బౌల్డ్ అయ్యాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి  వచ్చిన శామ్ కరన్(34) అరంభంలో ఆడిన చివరి చాలా బంతులను మిస్ చేసి  ఇన్నింగ్స్ చివరి బంతికి బౌల్డ్ అయ్యాడు.
    Published by:Rekulapally Saichand
    First published: