Home /News /sports /

IPL 2021 LIVE CRICKET SCORE SUNRISERS HYDERABAD VS KOLKATA KNIGHT RIDERS SRH TARGET 187

SRH vs KKR Live Score: నితీష్ రాణా మెరుపు ఇన్నింగ్స్... సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే!

nithish rana

nithish rana

ఓపెనర్లు నితీశ్‌ రాణా,శుభమన్‌ గిల్‌ పోటిపడి బౌండరీలు సాధించారు. పవర్‌ప్లేలో కోల్‌కతా 50 పరుగులు సాధించింది. వీరిద్దరి భాగస్వామ్యాన్ని రషిద్ ఖాన్ వీడదిశాడు.



    ఐపీఎల్ 2021‌లో చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. . నితిశ్ రాణా (80 ) ఝళీపించడంతో కేకేఆర్.. సన్‌రైజర్స్ ముందు 187 భారీ టార్గెట్‌ను ఉంచింది. మెుదటిగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డీంగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన కేకేఆర్ మెుదటి నుంచి దాటిగానే ఆడింది.

    ఓపెనర్లు నితీశ్‌ రాణా,శుభమన్‌ గిల్‌ పోటిపడి బౌండరీలు సాధించారు. పవర్‌ప్లేలో కోల్‌కతా 50 పరుగులు సాధించింది. వీరిద్దరి భాగస్వామ్యాన్ని రషిద్ ఖాన్ వీడదిశాడు. 7 ఓవర్ చివరి బంతికి శుభమన్‌ గిల్‌(15) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత నితీశ్‌ రాణాకు జత కలిసిన త్రీపాటి స్కోర్‌ను మరింతగా పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ సిక్స్‌లు,ఫోర్లతో విరుచుకుపడ్డాడు. స్కోర్ రేటును అమాంతం పెంచేశారు. 10 ఓవర్లకు కోల్‌కతా 83 పరుగులు సాధించింది. వార్నర్ ప్రయోగాలు చేస్తున్నప్పటికి కోల్‌కతా బ్యాట్స్‌మెన్స్ ఏమాత్రం తగ్గలేదు. బంతిని బౌండరీకి తరలించడమో పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో  నితీశ్‌ రాణా(80; 56 బంతుల్లో 9x4, 4x6), రాహుల్‌ త్రిపాఠి (53; 29 బంతుల్లో 5x4, 2x6)   హాఫ్ సెంచరీలు సాధించారు.

    వీరిద్దరి పాట్నర్‌షిప్‌ను నటరాజన్ వీడదిశాడు. 16 ఓవర్లో నటరాజన్‌ రెండో బంతికి రాహుల్‌ త్రిపాఠి(53) వికెట్‌ కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పడి నుంచి కేకేఆర్ కాస్త నెమ్మదించింది. ఆ తర్వాత కేకేఆర్ వెంటనే వికెట్స్ కోల్పోయింది. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (22; 9 బంతుల్లో 2x4, 1x6)  మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నబీ, రషీద్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు తీయగా, నటరాజన్‌, భువనేశ్వర్‌  ఒక్కో వికెట్  పడగొట్టారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: IPL 2021, Kolkata Knight Riders, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు