• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 LIVE CRICKET SCORE CHENNAI SUPER KINGS VS DELHI CAPITALS MATCH DELHI WON THE MATCH SA

CSK Vs DC: చెన్నై ఇంకా మారలేదు.. షా జోరు.. గబ్బర్ గర్జన.. మ్యాచ్ ఢిల్లీదే

CSK Vs DC: చెన్నై ఇంకా మారలేదు.. షా జోరు.. గబ్బర్ గర్జన.. మ్యాచ్ ఢిల్లీదే

Chennai Super Kings vs Delhi Capitals

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021లో తన ప్రయాణాన్ని ఓటమితో మెుదలుపెట్టింది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌.. చెన్నైని ఘోరంగా ఓడించింది.

  • Share this:
    చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021లో తన ప్రయాణాన్ని ఓటమితో మెుదలుపెట్టింది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఏడు వికెట్ల తేడాతో  చెన్నైని ఘోరంగా ఓడించింది. 8 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్ ఊప్‌నా ఉదేశారు. దిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతూ పూర్తి అధిపత్యం చేలాయించారు. ఇద్దరూ చెన్నై బౌలర్లను చెడుగుడాడుకున్నారు. సీఎస్‌కే నిర్దేశించిన 189 పరుగుల టార్గెట్ పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఫోర్లు,సిక్సర్లతో విరుచుపడుతూ హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఓవర్‌కు 10 పైగా పరుగులు చేస్తూ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాటిగా ఆడుతున్న పృథ్వీ షా(72) డ్రాన్ బ్రావో.. మెయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత పంత్ కూడా తన జోరును కొనసాగించాడు. శిఖర్ దావన్ 17 ఓవర్లో ఠాకూర్‌ వేసిన మూడో బంతికి ధావన్‌(85) ఎల్బీగా వెనుదిరిగాడు. 19 ఓవర్లో దాటిగా ఆడే క్రమంలో స్టోయినిస్‌(14) క్యాచ్ ఔట్ అయ్యాడు. చివరికి పంత్(15) విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు.



    మెుదట బ్యాటింగ్ చేసిన చెన్నైభారీ స్కోర్ సాధించింది. నిర్ణత 20 ఓవర్లో 188 పరుగులు చేసింది. రైనా(54) తన మెుదటి మ్యాచ్‌లోనే హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఆదరగొట్టాడు. మెుదటిగా టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డీండ్ ఎంచుకుంది. చెన్నై ఇన్నింగ్స్‌ను డుప్లెసిస్‌, గైక్వాడ్‌లు ఆరంభించారు. ఢిల్లీ తరుపున తొలి ఓవర్‌ను క్రిస్‌ వోక్స్‌ ప్రారంభించాడు. ఆరంభంలోనే చెన్నైకి ఎదురుదెబ్బ తగిలింది.

    ఆవేశ్‌ ఖాన్‌ వేసిన రెండో ఓవర్లో డుప్లెసిస్‌(0) ఎల్బీగా వెనుదిరిగాడు.  ఫష్ట్ డౌన్‌లో  మొయిన్‌ అలీ బ్యాటింగ్‌కు దిగాడు. ఆ తర్వాత వోక్స్‌ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికే గైక్వాడ్‌ ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. పవర్‌ప్లేలోనే సీఎస్‌కే రెండు వికెట్లు కోల్పోవడంతో చెన్నై శిబిరంలో కొంత ఆందోళన కనిపించింది. అనంతరం సురేశ్‌ రైనా,మొయిన్‌ అలీ భారీ షాట్లతో విరుచుపడ్డారు. రవిచంద్రన్ అశ్వీన్ వేసిన 5 ఓవర్‌లో రైనా రెండు ఫోర్లు కొట్టి హిట్టింగ్ ప్రారంభించాడు. 5 ఓవర్లకు చెన్నై 30/2 పరుగులు చేసింది. అశ్విన్‌ వేసిన 7,9 ఓవర్లో మొయిన్‌ అలీ రెండు ఫోర్లు
    రెండు సిక్సర్లు బాది చెన్నై ఇన్నింగ్స్‌ను పరుగుల పెట్టించారు. ఆ తర్వాత మరో సిక్స్ కొట్టే ప్రయత్నంలో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత రైనా, అంబటి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.
    భారీ షాట్‌కు యత్నించిన అంబటి రాయుడు ధావన్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. డబుల్‌ తీసే ప్రయత్నంలో రైనా రనౌట్‌గా కాగా ధోనీ తను ఎదుర్కొన్న రెండో బంతికే బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శామ్ కరన్(34) భారీ షాట్‌లతో విరుచుపడడంతో చెన్నై 188 పరుగులు చేసింది
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు