ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో ఓటిమిని చవిచూసింది. 134 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని రాజస్థాన్ బ్యాట్స్‌మెన్స్ ఆడుతూపాడుతూ ఛేదించారు. కేకేఆర్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి రంగంలో దిగిన రాజస్థాన్ ఓపెనర్లు సరైన అరంభాన్ని అయితే ఇవ్వలేకపోయారు. వరుణ్ చక్రవర్తి వేసిన 4 ఓవర్‌లో జోస్ బట్లర్(5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దాంతో రాజస్థాన్ 21 పరుగుల వద్ద తన తొలి వికెట్‌ను కోల్పోయింది. తర్వాత జైశ్వాల్, సామ్సన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్ళారు.
Match 18. It's all over! Rajasthan Royals won by 6 wickets https://t.co/AkyLqHRgFW #RRvKKR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 24, 2021
శివమ్ మావి వేసిన 5 ఓవర్‌లో యశస్వి జైశ్వాల్(22) ఐదో బంతికి ఔటయ్యాడు. భారీ షాట్‌కు యత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్‌దూబె(22) మంచి షాట్‌లతో అలరించాడు. దాటిగా ఆడే క్రమంలో వరుణ్ చక్రవర్తి వేసిన 11 ఓవర్‌లో శివమ్‌దూబె(22) ఔటయ్యాడు. తర్వా్త క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ తెవాతియా(4) నిరాశపరిచాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ 100 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. చివరకు సామ్సన్(42), మిల్లర్ (23) స్లో అండ్ స్టడీగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.