CSK vs KKR: తడబడి నిలబడ్డ కోల్‌కతా నైట్‌రైడర్స్.. చెన్నై సూపర్ కింగ్స్ ముందు టార్గెట్ ఎంతంటే

చెన్నై సూపర్ కింగ్స్‌కు 171 పరుగుల టార్గెట్ సెట్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (PC: IPL)

CSK vs KKR: అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు సమిష్టిగా ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసి చెన్నై ముందు భారీ టార్గెట్ ఉంచారు.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా అబుదాబిలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. మొదట్లో కాస్త తడబడినట్లు కనపడినా కోల్‌కతా బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. కోల్‌కతా ఓపెనింగ్ బ్యాటర్లు శుభమన్‌గిల్ (9), వెంకటేశ్ అయ్యర్ (18) (Venkatesh iyer) నిరాశ పరిచారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (8) కూడా తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరాడు. అయితే రాహుల్ త్రిపాఠి (45), నితీశ్ రాణా (37) కీలకమైన పరుగులు చేశారు. ఆండ్రీ రస్సెల్ (20) తక్కువ పరుగులకే అవుటైనా.. చివర్లో దినేశ్ కార్తీక్ 11 బంతుల్లోనే 26 పరుగులు చేయడంతో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది.

    చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు మొదట్లో వికెట్లు తీస్తూ, పరుగులను నిలువరించారు. అయితే నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్ వారిపై ఎదురు దాడి చేయడంతో పరుగులు వరదలై పారాయి. గత రెండు మ్యాచ్‌లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగలిగింది. కానీ ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లను డెత్ వోవర్లలో దినేశ్ కార్తీక్ దంచి కొట్టాడు.

    Team India Women: ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా చారిత్రాత్మక విజయం.. పలు రికార్డులు బద్దలు











    ఈ మ్యాచ్‌లో కనుక విజయం సాధిస్తే కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉన్నది. అయితే రాత్రి జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తే తిరిగి నాలుగో స్థానానికి పడిపోనున్నది.
    Published by:John Naveen Kora
    First published: