హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 - KKR Vs SRH : రైడర్స్ వర్సెస్ రైజర్స్.. టాస్ గెలిచిన హైదరాబాద్.. రెండు జట్లలో మార్పులు..

IPL 2021 - KKR Vs SRH : రైడర్స్ వర్సెస్ రైజర్స్.. టాస్ గెలిచిన హైదరాబాద్.. రెండు జట్లలో మార్పులు..

IPL 2021 - KKR Vs SRH

IPL 2021 - KKR Vs SRH

IPL 2021 - KKR Vs SRH : పరువు కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంటే.. ప్లే ఆఫ్ రేస్ లో నిలవడానికి తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయింది కోల్ కతా నైట్ రైడర్స్.

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 (IPL 2021 Latest Updates) సెకండాఫ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తోంది. సూపర్ సండే లో రెండో మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ (KKR Vs SRH) తలపడుతున్నాయ్. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు . హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. దీంతో ఇతర జట్ల విజయావకాశాలను దెబ్బతీసేందుకు రెడీ అయింది కేన్ సేన. రెండు జట్లు మార్పులు చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ ను జట్టులోకి తీసుకుంది. సన్ రైజర్స్ లో ఉమ్రన్ మాలిక్ జట్టులోకి వచ్చాడు. KKRకి ప్రతి మ్యాచ్ ఇప్పుడు డూ ఆర్ డై లాంటిదే. 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న కోల్ కతా.. తాడో పేడో తేల్చుకోని.. ప్లే ఆఫ్ రేస్ లో స్ట్రాంగ్ గా నిలవాలని చూస్తోంది.

కోల్ కతా బ్యాటింగ్ లైనప్ లో ఓపెనర్లు కీలకంగా మారారు. శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ లు మంచి ఆరంభాల్ని అందిస్తున్నారు. రాహుల్ త్రిపాఠి కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే, కెప్టెన్ మోర్గాన్ ఫామ్ కోల్ కతాని కలవరపెడుతోంది. అతని బ్యాట్ నుంచి ఇప్పటివరుకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. నితీశ్ రానా, దినేశ్ కార్తీక్ ఫర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్ లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తమ మిస్టరీ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు.

ఇక, సన్ రైజర్స్ పరిస్థితి భిన్నంగా ఉంది. దూకుడుగా ఉండే ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను గత రెండు మ్యాచ్ లో పక్కన పెట్టింది. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు తేలిపోయారు. ఇంగ్లండ్ డేంజరస్ ఓపెనర్ జాసన్ రాయ్.. సూపర్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కేన్ మామ.. క్లాస్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటాడో లేదో వేచి చూడాలి. మిడిలార్డర్ లో కూడా చెప్పుకోదగ్గ బ్యాటర్ లేకపోవడం సన్ రైజర్స్ కు మైనస్ పాయింట్. సిద్ధార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్ తో పాటు జాసన్ హోల్డర్ కూడా డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేశారు. ఇక, రషీద్ ఖాన్ స్పిన్ విభాగంలో దుమ్మురేపుతున్నాడు.

హెడ్ టు హెడ్ రికార్డులు :

ఇక, హెడ్ టు హెడ్ రికార్డులు కోల్ కతా కే అనుకూలం గా ఉన్నాయ్. కోల్ కతా 13 మ్యాచ్ ల్లో గెలిస్తే.. హైదరాబాద్ కేవలం 7 మ్యాచ్ ల్లో మాత్రమే నెగ్గింది.

తుది జట్లు :

కోల్ కతా నైట్ రైడర్స్ : శుభ్ మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ ( కెప్టెన్), నితీశ్ రానా, దినేశ్ కార్తీక్, షకీబ్ ఉల్ హసన్, సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి.

సన్ రైజర్స్ హైదరాబాద్ : జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ వర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్ద్ కౌల్, ఉమ్రన్ మాలిక్.

First published:

Tags: IPL 2021, Kane Williamson, Kolkata Knight Riders, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు