Home /News /sports /

IPL 2021 KKR VS SRH LIVE UPDATES SUNRISERS HYDERABAD VS KOLKATA KNIGHT RIDERS MATCH KKR WON BY 6 WICKETS SU

IPL 2021 - KKR Vs SRH: శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం.. హైలెట్స్ ఇవే..

IPL 2021 - KKR Vs SRH

IPL 2021 - KKR Vs SRH

ఐపీఎల్ 2021 (IPL 2021)‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై (sunrisers hyderabad) కోల్‌కతా నైట్ రైడర్స్ (kolkata knight riders) విజయం సాధించింది.

    ఐపీఎల్ 2021 (IPL 2021)‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై (sunrisers hyderabad) కోల్‌కతా నైట్ రైడర్స్ (kolkata knight riders) విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో నైట్ రైడర్స్ పాయింట్లు  12కి చేరాయి. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 115 పరుగులు చేసింది. దీంతో 116 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్.. లక్ష్యం చిన్నదైనప్పటికీ చివరి ఓవర్ వరకు శ్రమించాల్సి వచ్చింది. కోల్‌కతా ఆటగాళ్లలో శుభమన్‌ గిల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కోల్‌కతా ఇన్నింగ్ విషయానికి వస్తే.. తొలి మూడు ఓవర్లలో ఓపెనర్లు శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆ తర్వాత దూకుడుగా ఆడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే 5వ ఓవర్‌లో కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ వెంకటేశ్(8) అయ్యర్ జోసన్ హోల్డర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(7).. కొద్దిసేపటికే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులో వచ్చిన నితిశ్ రానా, శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు.

    ఈ క్రమంలోనే శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 17వ ఓవర్‌లో జాసన్ హోల్డర్ బౌలిగ్‌లో నితిశ్ రానా (25) పెవిలియన్ చేరాడు. ఇక, విజయానికి చేరువ అవుతున్న సమయంలో 57 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్.. సిద్దార్థ్ కౌల్‌ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్ చేతికి చిక్కాడు. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 106 పరుగులు చేసింది. దీంతో చివరి రెండు ఓవర్లలో ఆ జట్టుకు 10 పరుగులు అవసరమయ్యాయి. అయితే 19 ఓవర్‌లో 7 పరుగులు రావడంతో చివరి ఓవర్‌లో మూడు చేయాల్సి వచ్చింది. తొలి మూడు బంతుల్లో రెండు పరుగులు చేసిన కోల్‌కత్తా.. నాలుగో బంతిని దినేష్ కార్తీక్ బౌండరీ దాటించడంతో కోల్‌కతా విజయం సాధించింది. దినేష్ కార్తీక్(18), మోర్గాన్ (2) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.  దీంతో కోల్‌కతా 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. సన్ రైజర్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్ రెండు‌, రషీద్‌ ఖాన్‌, సిద్దార్థ్‌ కౌల్ తలో వికెట్‌ తీశారు.

    అంతకు ముందు.. బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. టిమ్ సౌథి మొదటి ఓవర్ రెండో బంతికే సన్ రైజర్స్ ఓపెనర్ వృద్దిమాన్ సాహా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సన్ రైజర్స్ సారథి కేన్ విలియమ్సర్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే జాసన్ రాయ్(10) శివమ్ మావి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే ఆరో ఓవర్‌లో నాలుగు ఫోర్లతో విలియమ్సన్ చెలరేగాడు. అయితే ఆ తర్వాతి ఓవర్‌లోనే షకీబ్ బౌలింగ్‌లో పరుగు తీసేందుకు యత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో 7 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ కష్టాల్లో పడింది.

    ఆ తర్వాత 11 ఓవర్‌లో అభిషేక్ శర్మ పెవిలియన్‌కు చేరాడు. నెమ్మదిగా ఆడుతూ వచ్చిన ప్రియమ్ గార్గ్ వరుణ్ చక్రవర్తి వేసిన 15వ ఓవర్ రెండో బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జాసన్ హోల్డర్(2).. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత 25 పరుగుల చేసిన అబ్దుల్ సమద్ టిమ్ సౌథీ వేసిన 18 ఓవర్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రషీద్ ఖాన్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో టిమ్‌ సౌథీ, వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ మావి తలో రెండు వికెట్లు, షకీబ్‌ అల్ హసన్‌ ఒక వికెట్‌ తీశారు.

    4000 పరుగులు సాధించిన దినేష్ కార్తీక్..
    ఈ మ్యాచ్‌తో దినేష్ కార్తీక్ ఐపీఎల్ కేరీర్‌లో 4 వేల పరుగుల మైలు రాయిని దాటేశాడు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: IPL 2021, Kolkata Knight Riders, SRH, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు