IPL 2021 KKR VS RR LIVE UPDTAES TODAY MATCH KOLKATA KNIGHT RIDERS VS RAJASTHAN ROYALS UPDATESKKR WON BY 86 RUNS SU
IPL 2021 - KKR Vs RR: రాజస్తాన్‌పై కోల్‌కతా ఘన విజయం.. 85 పరుగులకే కుప్పకూలిన రాజస్తాన్..
(Image Credit- Twitter/IPL)
ఐపీఎల్ 2021(IPL 2021)లో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2021(IPL 2021)లో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా జట్టు ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. మరోవైపు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించడానికి ముంబై ఇండియన్స్ 171 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఓడించాలి. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించిన అంత భారీ విజయం అసాధ్యం.
ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్కత్తా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. కోల్కత్తా బ్యాట్స్‌మెన్ రాణించడంతో.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కోల్కత్తా జట్టు 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో 172 లక్ష్యాన్ని బరిలోకి దిగిన రాజస్తాన్ జట్టు 85 పరుగులకే కుప్పకూలింది. వెంట వెంటనే రాజస్తాన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ దశలో రాజస్తాన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. దీంతో రాజస్తాన్ ఘోరంగా ఓడిపోతుందని అంతా భావించారు. అయితే రాహుల్ తేవాటియా ఒంటరి పోరాటంతో జట్టు స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. చివరకు 16.1 ఓవర్లలో 85 పరుగుల వద్ద రాజస్తాన్ జట్టు అలౌట్ అయింది.
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. షకీబ్ ఉల్ హసన్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి రాజస్తాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (0) క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత రాజస్తాన్ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. సంజ్ శాంసన్(1), లివింగ్ స్టోన్(6), అనుజ్ రావత్(0), పిలిప్స్ (8), శివమ్ దూబే (18), క్రిస్ మోరిస్(0) తక్కువ వ్యవధిలోనే పెవిలియన్ బాట పట్టారు. దీంతో రాజస్తాన్ జట్టు 9 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి.. 35 పరుగులు చేసింది. దీంతో ఆట జట్టు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.
అయితే రాహుల్ తేవాటియా మాత్రం రాజస్తాన్ స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. 10 ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. అయితే 12 ఓవర్లో ఉనద్కత్ (6) ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత చేతన్ సకారియా క్రీజులోకి వచ్చాడు. అతడు 16 ఓవర్లో రనౌట్ అయ్యాడు. ఇక, ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన రాహుల్ తేవాటియా.. శివమ్ మాన్వి వేసిన 17వ ఓవర్ తొలి బంతికి అవుట్ అయ్యాడు. దీంతో 85 పరుగులకే రాజస్తాన్ జట్టు అలౌట్ అయింది. ఇక, కోల్‌కతా బౌలర్స్‌లో శివమ్ మాన్వి 4 వికెట్లు, ఫెర్గ్యూసన్ 3 వికెట్లు, షకీబ్ ఉల్ హసన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
ఇక, అంతకుముందు.. కోల్కత్తా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్.. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించారు. నిలకడగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరగులు పెట్టించే ప్రయత్నం చేశారు. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోర్ 69/0గా ఉంది. అయితే ఆ తర్వాత ఓవర్లో కోల్‌కతా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్.. రాహుల్ తేవాటియా బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత నితీశ్ రాణా క్రీజులోకి వచ్చాడు. అయితే నితీశ్ రాణా చాలా దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఫిలిప్స్ వేసిన 12 వ ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన నితీశ్ రాణా.. నాలుగో బంతికి సిక్సర్ బాదాడు. అయితే ఆ తర్వాత బంతికే నితీశ్ రాణా(12) లివింగ్ స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి క్రీజులోకి వచ్చాడు.
శుభమన్ గిల్‌తో కలిసి రాహుల్ త్రిపాఠి.. కోల్‌కతా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శుభమన్ గిల్(44 బంతుల్లో 56).. 16వ ఓవర్లో క్రిస్ మోరిస్ వేసిన బంతికి యశస్వి జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. అయితే 18 ఓవర్లో రాహుల్ త్రిపాఠి(21) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కోల్‌కతా సారథి ఇయాన్ మోర్గాన్ క్రీజులోకి వచ్చాడు. ఇక, నిర్ణీత 20 ఓవర్లలో కోల్కత్తా జట్టు 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (14), ఇయాన్ మోర్గాన్(13) నాటౌట్‌గా నిలిచారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్స్‌లో క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.