IPL 2021 KKR VS RR LIVE UPDTAES TODAY MATCH KOLKATA KNIGHT RIDERS VS RAJASTHAN ROYALS UPDATES LIVE SCORE HERE SU
IPL 2021 - KKR Vs RR: శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. రాజస్తాన్ రాయల్స్ ముందు ఫైటింగ్ టోటల్..
(Image Credit-IPL)
ఐపీఎల్ 2021లో నేడు రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ,కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్కత్తా జట్టు బ్యాటింగ్‌కు దిగింది.
ఐపీఎల్ 2021(IPL 2021) సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. అయితే నేడు రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ,కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ కి కలకత్తా జట్టు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్కత్తా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. కోల్కత్తా బ్యాట్స్‌మెన్ రాణించడంతో.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కోల్కత్తా జట్టు 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో రాజస్తాన్ జట్టు ముందు 172 లక్ష్యాన్ని ఉంచింది.
కోల్కత్తా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్.. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించారు. నిలకడగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరగులు పెట్టించే ప్రయత్నం చేశారు. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోర్ 69/0గా ఉంది. అయితే ఆ తర్వాత ఓవర్లో కోల్‌కతా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్.. రాహుల్ తేవాటియా బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత నితీశ్ రాణా క్రీజులోకి వచ్చాడు. అయితే నితీశ్ రాణా చాలా దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఫిలిప్స్ వేసిన 12 వ ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన నితీశ్ రాణా.. నాలుగో బంతికి సిక్సర్ బాదాడు. అయితే ఆ తర్వాత బంతికే నితీశ్ రాణా(12) లివింగ్ స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి క్రీజులోకి వచ్చాడు. శుభమన్ గిల్‌తో కలిసి రాహుల్.. కోల్‌కతా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శుభమన్ గిల్(44 బంతుల్లో 56).. 16వ ఓవర్లో క్రిస్ మోరిస్ వేసిన బంతికి యశస్వి జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. అయితే 18 ఓవర్లో రాహుల్ త్రిపాఠి(21) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కోల్‌కతా సారథి ఇయాన్ మోర్గాన్ క్రీజులోకి వచ్చాడు. ఇక, నిర్ణీత 20 ఓవర్లలో కోల్కత్తా జట్టు 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (14), ఇయాన్ మోర్గాన్(13) నాటౌట్‌గా నిలిచారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్స్‌లో క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.
కోల్‌కత్తాకు కీలకం..
ఇక, ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ కి కలకత్తా జట్టు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉంటాయి. రన్‌రేట్ పరంగా ముంబై ఇండియన్స్ కన్నా కోల్కత్తా నైట్‌రైడర్స్ మెరుగ్గా ఉండటమే అందుకు కారణం. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే అప్పుడు కోల్‌కతా ప్లే ఆశలు.. ముంబై, హైదరాబాద్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ గెలిచిన కూడా ప్లే ఆఫ్ రేస్ చేరుకునే అవకాశాలు తక్కువే. ఎందుకంటే.. ఆ జట్టు రన్ రేట్ చాలా తక్కువగా ఉండటమే కారణం. రాజస్తాన్ ప్లే ఆఫ్ బరిలో నిలవాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కష్టమనే చెప్పాలి. దీంతో ఈ మ్యాచ్ కోల్‌కతాకు చాలా కీలకమైనది.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఇరు జట్లు 23 సార్లు తలపడ్డాయ్. ఇందులో 12 మ్యాచ్ ల్లో కోల్ కతా గెలవగా.. మరో 11 గేమ్స్ లో రాజస్ధాన్ విజయకేతనం ఎగురవేసింది. వీరిద్దరి మధ్య జరిగిన గత మ్యాచ్ లో కోల్ కతా పై రాజస్థాన్ విక్టరీ కొట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.