IPL 2021 - KKR Vs RR : డూ ఆర్ డై ఫైట్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. రెండు జట్లలో మార్పులివే..!

IPL 2021 - KKR Vs RR

IPL 2021 - KKR Vs RR : ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. నాలుగు మార్పులతో బరిలోకి దిగింది రాజస్థాన్ రాయల్స్. లివింగ్ స్టోన్, క్రిస్ మోరిస్, అనుజ్ రావత్, జై దేవ్ ఉనాద్కత్ జట్టులోకి వచ్చారు.

  • Share this:
    ఐపీఎల్ 2021(IPL 2021 Season Latest Updates) సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు (Play Off Race) ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చెన్నై (CSK), ఢిల్లీ (DC), బెంగళూరు (RCB) ప్లే ఆఫ్స్ చేరుకోగా.. నాలుగో స్థానం కోసం అసలు పోరాటం మొదలైంది. ఈ నేపథ్యంలో అసలు సిసలు పోరుకు రెడీ అయ్యాయ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ (KKR Vs RR). షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న కీ ఫైట్ లో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయ్. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. నాలుగు మార్పులతో బరిలోకి దిగింది రాజస్థాన్ రాయల్స్. లివింగ్ స్టోన్, క్రిస్ మోరిస్, అనుజ్ రావత్, జై దేవ్ ఉనాద్కత్ జట్టులోకి వచ్చాడు. ఇక, కోల్ కతా నైట్ రైడర్స్ ఒక మార్పు చేసింది. టిమ్ సౌథీ స్ధానంలో లుకీ ఫెర్గ్యూసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. నాలుగో స్థానంలో నిలవాలంటే.. ఈ పోరు కోల్ కతా కు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ లో గెలిస్తే కచ్చితంగా కోల్ కతా కే మెరుగైన అవకాశాలుంటాయ్. ఇక, రాజస్థాన్ ఈ మ్యాచ్ లో గెలిచి .. మిగతా సమీకరణాలతో ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలని భావిస్తోంది.

    కోల్ కతా బ్యాటింగ్ లైనప్ లో ఓపెనర్లు కీలకంగా మారారు. శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ లు మంచి ఆరంభాల్ని అందిస్తున్నారు. రాహుల్ త్రిపాఠి కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే, కెప్టెన్ మోర్గాన్ ఫామ్ కోల్ కతాని కలవరపెడుతోంది. అతని బ్యాట్ నుంచి ఇప్పటివరుకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. నితీశ్ రానా, దినేశ్ కార్తీక్ ఫర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్ లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తమ మిస్టరీ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఫాస్ట్ బౌలింగ్ లో టిమ్ సౌథీ, శివమ్ మావిలు కీలకం కానున్నారు.

    మరోవైపు, రాజస్థాన్‌ రాయల్స్‌ పరిస్థితి భిన్నంగా ఉంది. సంజూ జట్టు గత మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. రాజస్థాన్‌ ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. ఆ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ తప్ప.. ఏ బ్యాటర్ పరుగులు చేయడం లేదు. కీలక మ్యాచ్ కావడంతో యశస్వి జైపాల్, గ్లెన్ ఫిలిప్స్, శివమ్ దూబే రాణించాల్సిన అవసరం ఉంది.


    హెడ్ టు హెడ్ రికార్డులు :
    ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఇరు జట్లు 23 సార్లు తలపడ్డాయ్. ఇందులో 12 మ్యాచ్ ల్లో కోల్ కతా గెలవగా.. మరో 11 గేమ్స్ లో రాజస్ధాన్ విజయకేతనం ఎగురవేసింది. వీరిద్దరి మధ్య జరిగిన గత మ్యాచ్ లో కోల్ కతా పై రాజస్థాన్ విక్టరీ కొట్టింది.

    తుది జట్లు :

    కోల్ కతా నైట్ రైడర్స్ : శుభ్ మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ ( కెప్టెన్), నితీశ్ రానా, దినేశ్ కార్తీక్, షకీబ్ ఉల్ హసన్, సునీల్ నరైన్, శివమ్ మావి, లుకీ ఫెర్గ్యూసన్, వరుణ్ చక్రవర్తి.

    రాజస్తాన్ రాయల్స్: లియామ్ లివింగ్ స్టోన్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రహమాన్.
    Published by:Sridhar Reddy
    First published: