IPL 2021 - KKR Vs PBKS : కీ ఫైట్ కు కోల్ కతా, పంజాబ్ రెడీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, తుది జట్లు ఇవే..!

IPL 2021 - KKR Vs PBKS

IPL 2021 - KKR Vs PBKS : ఐపీఎల్ 2020 మాదిరిగానే ఈసారి కూడా లీగ్ చివరివరకు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం అయ్యేలా లేవు. చెన్నై సూపర్ కింగ్స్ (18) ఇప్పటికే అధికారిక ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ (16)​ కూడా ఆ దిశగా వెళుతోంది. మరో రెండు స్థానాల కోసం హోరాహోరీ పోటీ కనిపిస్తోంది.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021 Season Latest Updates) సెకంండాఫ్ హోరాహోరీగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ రేస్ కోసం SRH మినహా మిగతా జట్లు ప్రయత్నిస్తుండటంతో .. ఫ్యాన్స్ కు కావాల్సినంత మజా వస్తోంది. ఐపీఎల్ 2020 మాదిరిగానే ఈసారి కూడా లీగ్ చివరివరకు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం అయ్యేలా లేవు. చెన్నై సూపర్ కింగ్స్ (18) ఇప్పటికే అధికారిక ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ (16)​ కూడా ఆ దిశగా వెళుతోంది. మరో రెండు స్థానాల కోసం హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఐదు జట్లు రెండు బెర్తుల కోసం పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ కు ఐపీఎల్ రెడీ అయింది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌ , మోర్గాన్ కెప్టెన్సీలోని కేకేఆర్‌తో (KKR Vs PBKS) అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ రాహుల్ సేనకు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే.. వారి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచడానికి పంజాబ్ ఈ మ్యాచ్‌ను తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. మరోవైపు కేకేఆర్‌ జట్టు సెకండాఫ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం పది పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది కేకేఆర్.

    పంజాబ్ కింగ్స్ లో రాహుల్ (422 పరుగులు) మయాంక్ అగర్వాల్ (332) మినహా ఏ బ్యాట్స్‌మన్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. మిడిలార్డర్ పేలవంగా ఉంది. మరోవైపు, క్రిస్ గేల్ రూపంలో పంజాబ్ కు భారీ షాక్ తగిలింది. బయోబబుల్ ఒత్తిడికి బ్రేక్ చెప్పడానికి మిగతా మ్యాచ్ లకు దూరమయ్యాడు యూనివర్శల్ క్రిస్ గేల్.మరోవైపు పంజాబ్ బౌలింగ్ స్ట్రాంగ్ గానే ఉంది. మహ్మద్ షమీ, అర్షదీప్ పేస్ భారాన్ని మోస్తున్నారు. యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా ఆకట్టుకుంటున్నాడు.

    ఇక, కోల్ కతా బ్యాటింగ్ లైనప్ లో ఓపెనర్లు కీలకంగా మారారు. శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ లు మంచి ఆరంభాల్ని అందిస్తున్నారు. రాహుల్ త్రిపాఠి కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే, కెప్టెన్ మోర్గాన్ ఫామ్ కోల్ కతాని కలవరపెడుతోంది. అతని బ్యాట్ నుంచి ఇప్పటివరుకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. నితీశ్ రానా, దినేశ్ కార్తీక్ ఫర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్ లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తమ మిస్టరీ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు. టిమ్ సౌథీ, లుకీ ఫెర్గ్యూసన్ పేస్ బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కావడంతో.. తమ సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అయ్యాయ్.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    హెడ్ టు హెడ్ రికార్డులు కోల్ కతాకే అనుకూలంగా ఉన్నాయ్. ఇప్పటివరకు కోల్ కతా 19 మ్యాచ్ ల్లో న ెగ్గితే.. పంజాబూ్ కేవలం 9 మ్యాచ్ ల్లో మాత్రమే విజయాన్ని సాధించింది. ఇక, గత మూడు మ్యాచ్ ల్లో కోల్ కతానే నెగ్గింది.

    తుది జట్లు అంచనా :

    కోల్ కతా నైట్ రైడర్స్ : శుభ్ మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), నితీశ్ రానా, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, లుకీ ఫెర్గ్యూసన్, సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి

    పంజాబ్ కింగ్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), మణ్ దీప్ సింగ్/ మయాంక్ అగర్వాల్, మక్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, హర్ ప్రీత్ బార్, నాథన్ ఎల్లీస్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్
    Published by:Sridhar Reddy
    First published: