IPL 2021 KKR VS MI LIVE SCORE UPDATES MUMBAI INDIANS WON BY 10 RUNS SRD
KKR vs MI : మరోసారి రోహిత్ కెప్టెన్సీ మ్యాజిక్..ముంబై ఇండియన్స్ దే మ్యాచ్..
KKR vs MI : మరోసారి రోహిత్ కెప్టెన్సీ మ్యాజిక్..ముంబై ఇండియన్స్ దే మ్యాచ్..
KKR vs MI : జస్ప్రీత్ బుమ్రా 19 ఓవర్ లో కేవలం 4 పరుగులే ఇచ్చి..ముంబై విజయానికి బాటలు వేశాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మార్క్ కెప్టెన్సీ కన్పించింది. తన కెప్టెన్సీ బుర్రకు పదును పెడుతూ.. ఈ మ్యాచ్ ను గెలిపించాడు రోహిత్ శర్మ.
ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ లో ఓడిన ముంబై.. రెండో మ్యాచ్ లో అదరగొట్టింది. 10 పరుగుల తేడాతో కోల్ కతా పై విక్టరీ కొట్టింది. ఒక దశలో ఓడిపోతుందనుకున్న ముంబై .. ఆఖర్లో అదరగొట్టి మ్యాచ్ ను దక్కించుకుంది. జస్ప్రీత్ బుమ్రా 19 ఓవర్ లో కేవలం 4 పరుగులే ఇచ్చి..ముంబై విజయానికి బాటలు వేశాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మార్క్ కెప్టెన్సీ కన్పించింది. తన కెప్టెన్సీ బుర్రకు పదును పెడుతూ.. ఈ మ్యాచ్ ను గెలిపించాడు రోహిత్ శర్మ. యంగ్ కుర్రాడు రాహుల్ చాహర్ నాలుగు వికెట్లతో సూపర్ షో చేశాడు. ఇక ఆఖరి ఓవర్ లో వరసగా రెండు వికెట్లు తీసి.. ముంబై విజయాన్ని ఖాయం చేశాడు థండర్ బోల్ట్. 153 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కు శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్లు ఫస్ట్ వికెట్ కు 72 పరుగుల పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. ఆ తర్వాత ఊపు మీద కన్పించిన శుభ్ మన్ గిల్ ని రాహుల్ చాహర్ ను పెలివిలియన్ కు పంపాడు. శుభ్ మన్ గిల్ 24 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి స్కోరు బోర్డును ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండానే ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా రాహుల్ చాహర్ కే దక్కింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వికెట్ ను కూడా రాహుల్ చాహరే తీసుకున్నాడు. ఇయాన్ మోర్గాన్ 7 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసి ఊపు మీద కన్పించిన నితీశ్ రాణా వికెట్ కూడా రాహుల్ చాహర్ ఖాతాలో నే పడింది. నితీశ్ రాణా 47 బంతుల్లో 57 పరుగులు చేశాడు. నితీశ్ రాణాకి వరుసగా ఇది రెండో హాఫ్ సెంచరీ. ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్ పై 80 పరుగులు చేశాడు రాణా. ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రాహుల్ చాహర్ నాలుగు వికెట్లతో తన స్పెల్‌ను పూర్తి చేశాడు. ప్రతీ ఓవర్‌కు వికెట్ చొప్పున తీస్తూ ముంబైకి బ్రేక్ త్రూలు ఇచ్చాడు రాహల్ చాహర్ 27 పరుగులే ఇచ్చాడు. ఆపై కేకేఆర్ 122 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. షకీబుల్(9)ను కృనాల్ ఔట్ చేశాడు. అయితే, ఆఖర్లో రస్సెల్, కార్తీక్ తడబడటంతో మ్యాచ్ ముంబై వశమైంది.
ఇక, ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ వీరుడు (5/15) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), రోహిత్ శర్మ(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 43) మినహా అంతా విఫలమయ్యారు.ఈ ఇద్దరు ధాటిగా ఆడటంతో ఓ దశలో భారీ స్కోర్ చేస్తుందనుకున్న ముంబై.. వరుసగా వికెట్లు చేజార్చుకొని సాధారణ స్కోర్‌కు పరిమితమైంది.
కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన రస్సెల్.. చివరి ఓవర్లోనే మూడు వికెట్లు తీయడం గమనార్హం. ఇక కోల్‌కతా బౌలర్లలో రస్సెల్‌కు తోడుగా.. కమిన్స్ 2, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ సీజన్లో ఆలౌటైన తొలి జట్టుగా ముంబై అప్రతిష్టను మూటగట్టకుంది.ఇక, రేపటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ లో గెలవాలన్న పట్టుదలతో రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయ్.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.