KKR vs MI : ఐదు వికెట్లతో ముంబై నడ్డి విరిచిన రస్సెల్..కోల్ కతా టార్గెట్ ఎంతంటే..

KKR vs MI : ముంబై ఇన్నింగ్స్ లో సూర్య కుమార్ యాదవ్ తప్ప మిగతా బ్యాట్స్ మెన్ రాణించలేదు. పరుగులు చేయడానికి ముంబై ఇండియన్స్ ఇబ్బంది పడ్డారు. మరోవైపు కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ముంబై ని కట్టడి చేశారు.

KKR vs MI : ముంబై ఇన్నింగ్స్ లో సూర్య కుమార్ యాదవ్ తప్ప మిగతా బ్యాట్స్ మెన్ రాణించలేదు. పరుగులు చేయడానికి ముంబై ఇండియన్స్ ఇబ్బంది పడ్డారు. మరోవైపు కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ముంబై ని కట్టడి చేశారు.

  • Share this:
    ఈ సీజన్ లో బోణి కొట్టాలని భావిస్తోన్న ముంబై ఇండియన్స్ రెండో మ్యాచ్ లో కూడా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్‌(36 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. బౌలింగ్ లో ఆండ్రీ రస్సెల్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. క్రిస్‌ లిన్‌ బదులు జట్టులోకి వచ్చిన డికాక్‌ను(6 బంతుల్లో 2) వరుణ్‌ చక్రవర్తి బోల్తా కొట్టించాడు. డికాక్‌ భారీ షాట్‌ ఆడే క్రమంలో డీప్‌ మిడ్‌ వికెట్‌లో ఉన్న రాహుల్‌ త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఆచి తూచి ఆడాడు. కోల్‌కతా స్పిన్‌ ఎటాక్‌ను పదేపదే ప్రయోగించడంతో ముంబై జట్టు పరుగులు రాబట్టేందుకు చాలా ఇబ్బంది పడింది. అయితే, ఫస్ట్ లో నెమ్మదిగా ఆడిన సూర్యకుమార్ యాదవ్.. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 8వ ఓవర్‌లో గేర్‌ మర్చాడు. వరుసగా 6,4,4 పరుగులు సాధించి నెమ్మదించిన ముంబై స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అతను సిక్సర్‌ బాది అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్ల తర్వాత ముంబై వికెట్‌ నష్టానికి 81 పరుగులు చేసింది. ధాటిగా ఆడుతున్న సూర్యకుమార్‌(36 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) షకీబ్ బోల్తా కొట్టించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో 56 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద పెవిలియనకు చేరాడు. షకీబ్‌ బౌలింగ్‌లో లాంగ్‌ ఆన్‌ ఫీల్డర్‌ శుబ్‌మన్‌ గిల్‌ క్యాచ్‌‌ అందుకోడంతో సూర్యకుమార్‌ ఇన్నంగ్స్‌కు తెరపడింది. అయితే ఆ వెంటనే, పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ హుక్‌ షాట్‌ ఆడే క్రమంలో ఫైన్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నప్రసిద్ధ్‌ కృష్ణకు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ కిషన్‌(3 బంతుల్లో 1) పెవిలియన్‌ బాట పట్టాడు.

    ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ సిక్స్ కొట్టిన రోహిత్ గేర్ మార్చినట్లు కన్పించాడు. అయితే, వెంటనే ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. రోహిత్ 32 బంతుల్లో 43 పరుగులు చేశాడు. రోహిత్ అవుటైనా తర్వాత వెంటనే వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. 17 బంతుల్లో 15 పరుగులు చేసిన హార్దిక్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ లో పొలార్డ్, జన్ సన్ వెంటనే వెంటనే ఔటయ్యారు.

    ఆఖర్లో కృనాల్ పాండ్య వరుసగా రెండు బౌండరీలు కొట్టడంతో ముంబై ఈ స్కోరైనా సాధించింది. కోల్ కతా బౌలర్లో రస్సెల్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. ప్యాట్ కమిన్స్ రెండు వికెట్లతో అదరగొట్టాడు. రస్సెల్ రెండు ఓవర్లలో ఐదు వికెట్లు తీయడం విశేషం.
    Published by:Sridhar Reddy
    First published: