Home /News /sports /

IPL 2021 KKR VS MI LIVE SCORE UPDATES KOLKATA KNIGHT RIDERS HAVE WON THE TOSS AND HAVE OPTED TO FIELD FIRST SRD

KKR vs MI : ముంబై బోణి కొట్టేనా?..టాస్ గెలిచిన కోల్ కతా..ఒక మార్పుతో బరిలోకి రోహిత్ సేన..

ముంబై బోణి కొట్టేనా?..టాస్ గెలిచిన కోల్ కతా..ఒక మార్పుతో బరిలోకి రోహిత్ సేన..

ముంబై బోణి కొట్టేనా?..టాస్ గెలిచిన కోల్ కతా..ఒక మార్పుతో బరిలోకి రోహిత్ సేన..

KKR vs MI : ఐపీఎల్ 2021 సీజన్ లో మరో ఇంట్రెస్టింగ్ పోరు కాసేపట్లో జరగనుంది. ఈ రసవత్తర సమరానికి చెన్నై వేదిక కానుంది. బోణి కొట్టాలని ముంబై ఉవ్విల్లూరుతుంటే.. పాయింట్స్ టేబుల్ లో దూసుకెళ్లాలని కోల్ కతా భావిస్తోంది.

    ఐపీఎల్ 2021 సీజన్ లో మరో ఇంట్రెస్టింగ్ పోరు కాసేపట్లో జరగనుంది. డిఫెండింగ్ ఛాంప్స్ ముంబై ఇండియన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ అమీ తుమీ తేల్చుకోనుంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. ముంబై భారీ టార్గెట్ సెట్ చేస్తేనే ఈ మ్యాచ్ విజయావాకాశాలు వాళ్లకి ఆధారపడి ఉంటాయ్. కోల్‌కతా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 10 పరుగుల తేడాతో గెలిచి మంచి ఉత్సాహంతో ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన ముంబై టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తోంది. ఇరు జట్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ క్రిస్‌ లిన్ ఫర్వాలేదనిపించినా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభంలోనే రనౌట్‌కి అతను కారణమయ్యాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు సాధించి తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు లిన్‌. టీ20 ఫార్మాట్‌ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌గా పేరొందినా లిన్ ను పక్కన పెట్టింది ముంబై . ముంబై జట్టు బ్యాటింగ్‌ బలమంతా హార్డ్‌ హిట్టర్లే కాబట్టి లిన్‌ కంటే డీకాక్‌ వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపింది. గత మ్యాచులో ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మార్కో జాన్సన్ ఆకట్టుకున్నారు. కానీ స్పిన్నర్ రాహుల్ చహర్, కృనాల్ పాండ్యా ధారాళంగా పరుగులు ఇచ్చి మ్యాచ్ ఓటమికి కారణమయ్యారు.

    మరోవైపు కోల్‌కతా జట్టులో ఓపెనర్ నితీశ్ రాణా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌పై మ్యాచ్‌లో దూకుడుగా ఆడి 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, షకీబ్ ఉల్ హాసన్ సత్తాచాటారు. అయితే ఓపెనర్ శుభమన్ గిల్, పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంచనాల్ని అందుకోలేకపోయారు. వీరు గాడిలో పడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ విభాగంలో కోల్‌కతా పాట్ కమిన్స్‌పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రసీద్ కృష్ణ వికెట్లు తెస్తున్నా.. భారీగా పరుగులు ఇస్తున్నాడు. పటిష్టంగా ఉన్న ముంబై ఇండియన్స్ పై తప్పు చేస్తే ఇక అంతే సంగతులు.

    టోర్నీలో కోల్‌కతాపై ముంబై‌ పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇందులో 21 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందింది. ఆరు మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది.

    తుది జట్లు :

    Mumbai Indians (Playing XI): Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Ishan Kishan, Hardik Pandya, Kieron Pollard, Krunal Pandya, Marco Jansen, Rahul Chahar, Trent Boult, Jasprit Bumrah

    Kolkata Knight Riders (Playing XI): Nitish Rana, Shubman Gill, Rahul Tripathi, Eoin Morgan(c), Andre Russell, Dinesh Karthik(w), Shakib Al Hasan, Pat Cummins, Harbhajan Singh, Prasidh Krishna, Varun Chakravarthy
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2021, Kolkata Knight Riders, Mumbai Indians

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు