IPL 2021 - KKR Vs DC : ఢిల్లీ జోరును కోల్ కతా ఆపేనా..? టాస్ నెగ్గిన మోర్గాన్.. రెండు జట్లలో కీలక మార్పులు..!

IPL 2021 - KKR Vs DC

IPL 2021 - KKR Vs DC : ఐపీఎల్ 2021 (IPL 2021 Latest Telugu Updates) సెకండాఫ్ ఆఖరి అంకానికి చేరుకుంది. కచ్చితంగా ప్లే-ఆఫ్స్‌కు చేరుతాయ్ అనుకున్న జట్లు వరుస ఓటములు చవి చూడగా.. చెన్నై, ఢిల్లీ జట్లు సునాయాసంగా ప్లే-ఆఫ్స్‌కు చేరుకున్నాయి.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021 Latest Telugu Updates) సెకండాఫ్ ఆఖరి అంకానికి చేరుకుంది. కచ్చితంగా ప్లే-ఆఫ్స్‌కు చేరుతాయ్ అనుకున్న జట్లు వరుస ఓటములు చవి చూడగా.. చెన్నై, ఢిల్లీ జట్లు సునాయాసంగా ప్లే-ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తి పోరుకు ధనాధన్ లీగ్ రెడీ అయింది. బలబలాల్లో సమానంగా ఉన్న రెండు జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయ్. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (DC Vs KKR) టీంల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కోల్ కతా నైట్ రైడర్స్. రెండు మార్పులతో బరిలోకి దిగనుంది కోల్ కతా. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో సందీప్ వారియర్ కు చోటు కల్పించింది. టీమ్ సౌథీ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఢిల్లీ జట్టు 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు కోల్‌కతా జట్టు 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రెండో దశలో ఇప్పటి వరకు ఢిల్లీ రెండు మ్యాచులాడి రెండిట్లో గెలుపొందింది. హ్యాట్రిక్ విజయం కోసం ఎదరుచూస్తోంది. మరోవైపు కోల్‌కతా టీం మూడు మ్యాచులు ఆడి రెండు విజయాలు సాధించింది. గత మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓడిపోయింది కోల్ కతా.

    మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కీలక మార్పు చేసింది. పృథ్వీషా స్ధానంలో స్టీవ్ స్మీత్ కు చోటు కల్పించింది. ఈ విజయంతో టాప్ కు దూసుకెళ్లాలని పంత్ సేన భావిస్తోంది. మరోవైపు, ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలని కోల్ కతా నైట్ రైడర్స్ భావిస్తోంది. దీంతో, ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    హెడ్-టు-హెడ్ రికార్డులు :
    ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ 27 మ్యాచులు ఆడారు. కోల్ కతాదే అప్పర్ హ్యాండ్ గా ఉంది. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ 14, ఢిల్లీ క్యాపిటల్స్‌ 12 మ్యాచుల్లో విజయం సాధించారు. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.


    తుది జట్లు :

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), షిమ్రాన్ హెట్ మేయర్, లలిత్ యాదవ్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అన్రిచ్ నార్ట్జే, అవేష్ ఖాన్

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుభ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి, సందీప్ వారియర్
    Published by:Sridhar Reddy
    First published: