IPL 2021 - KKR Vs DC : ఢిల్లీ జోరుకు కోల్ కతా బ్రేకులు.. కీలక మ్యాచ్ లో సూపర్ విక్టరీ..

Photo Credit : Twitter

IPL 2021 - KKR Vs DC : ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు బ్రేకులు వేసింది కేకేఆర్. హ్యాట్రిక్ విక్టరీలతో టాప్ ప్లేస్ కు దూసుకువెళ్లాలన్న పంత్ సేన ఆశలపై నీళ్లు చల్లింది కోల్ కతా. ఈ విక్టరీతో తమ ప్లే ఆఫ్ ఆశల్ని మరింత పటిష్టం చేసుకుంది మోర్గాన్ సేన.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021 Telugu Latest News)లో భాగంగా.. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)ని మట్టికరిపించింది కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders). హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలన్న ఢిల్లీ జోరుకు బ్రేకులు వేసింది. మూడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి.. ప్లే ఆఫ్ బెర్త్ ని స్ట్రాంగ్ చేసుకుంది. 36 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు నితీశ్ రానా. శుభ్ మన్ గిల్ 30 పరుగులతో ఫర్వాలేదనింపించాడు. ఆఖర్లో సునీల్ నరైన్ 10 బంతుల్లో 21 పరుగులతో మెరుపు బ్యాటింగ్ చేసి ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లాడు. ఢిల్లీ బౌలర్లలో యంగ్ గన్ ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. వరుస విరామాల్లో ఢిల్లీ బౌలర్లు వికెట్లు తీసినా.. టార్గెట్ చిన్నదవ్వడంతో కోల్ కతా నెగ్గింది. ఈ విక్టరీతో 10 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ రేస్ లో స్ట్రాంగ్ గా నిలిచింది కోల్ కతా. మరో వైపు ఢిల్లీ 16 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచింది.

    128 పరుగులతో సాధారణ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతాకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. 28 పరుగుల జోడించిన తర్వాత 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లిలిత్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు వెంకటేశ్ అయ్యర్. మరో ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ 33 బంతుల్లో 30 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నెమ్మదిగా ఆడినా.. అతని ఇన్నింగ్స్ కేకేఆర్ కు లాభాన్నే చేకూర్చింది. అయితే, కోల్ కతా ఇన్నింగ్స్ లో అసలైన హీరో నితీశ్ రానానే. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ.. స్కోరు బోర్డు ప్రెషర్ ని తగ్గించాడు. ఇక, ఆఖర్లో కగిసో రబాడాలో ఓవర్ లో సునీల్ నరైన్ అద్భుత బ్యాటింగ్ తో కోల్ కతా విక్టరీని కన్ఫామ్ చేసుకుంది.


    అంతకుముందు.. కోల్‌కతా నైట్‌‌రైడర్స్(కేకేఆర్) బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న బౌలర్లు వరుస విరామాల్లో ఢిల్లీని దెబ్బతీశారు. దాంతో పంత్ సేన ప్రత్యర్థి ముందు 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్(34 బంతుల్లో 4 ఫోర్లతో 39), రిషభ్ పంత్(36 బంతుల్లో 3 ఫోర్లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

    కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్(2/18), వెంకటేశ్ అయ్యర్(2/29), లూకీ ఫెర్గూసన్(2/10) రెండేసి వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ తీశాడు. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్లుగా వెనుదిరిగారు. షార్జా అంటే సిక్సర్ల వర్షం కురుస్తుంది. అలాంటిది ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు.
    Published by:Sridhar Reddy
    First published: