IPL 2021 - KKR Vs DC : ఢిల్లీ జోరుకు KKR బౌలర్ల కళ్లెం..! కోల్ కతా టార్గెట్ ఎంతంటే..

Twitter

IPL 2021 - KKR Vs DC : కీలక మ్యాచ్ లో కోల్ కతా బౌలర్లు మెరిశారు. పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021 Telugu Latest News)లో భాగాంగా.. షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ సాధారణ టార్గెట్ కు పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది పంత్ సేన. స్టీవెన్ స్మిత్ 39 పరుగులు, పంత్ 39 రన్స్ తో ఫర్వాలేదనిపించారు. కోల్ కతా బౌలర్లలో ఫెర్య్గూసన్ 2 , వెంకటేశ్ అయ్యర్ 2, సునీల్ నరైన్ 2 వికెట్లతో ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు మంచి ఆరంభమే లభించింది. 35 పరుగుల వరకు వికెట్ కోల్పకుండా పరుగులు చేసింది. అయితే, శిఖర్ ధావన్ (24) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 35 వద్ద వెంకటేష్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వెంటనే శ్రేయాస్ అయ్యార్ (1 పరుగుల) మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు.

    సునీల్ నరైన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 40 వద్ద బౌల్డయ్యాడు. ఈ క్రమంలో 10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం రెండు వికెట్లు నష‌్టపోయి 65 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న స్మిత్ ను ఫెర్గ్యూసన్ పెవిలియన్ కు పంపాడు. స్మిత్ 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫెర్గ్యూసన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.

    ఆ వెంటనే హెట్ మెయిర్ 4 పరుగులు మాత్రమే చేసి బౌటయ్యాడు. వెంకటేష్ అయ్యర్ బౌలింగ్‌లో టీం స్కోర్ 88 వద్ద సౌతీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత లలిత్ యాదవ్ (0) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. నరైన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 89 వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ కూడా డకౌట్ అవ్వడంతో.. 94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. వెంకటేష్ అయ్యర్ బౌలింగ్‌లో టీం స్కోర్ 94 వద్ద పెవిలియన్ చేరాడు.


    ఆఖర్లో పంత్ వేగంగా ఆడటానికి ప్రయత్నించిన.. చివరికి కోల్ కతా బౌలర్లదే పై చేయి అయింది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఢిల్లీ బౌలర్లు శక్తికి మించి ప్రయత్నించాల్సిందే.

    హెడ్-టు-హెడ్ రికార్డులు :
    ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ 27 మ్యాచులు ఆడారు. కోల్ కతాదే అప్పర్ హ్యాండ్ గా ఉంది. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ 14, ఢిల్లీ క్యాపిటల్స్‌ 12 మ్యాచుల్లో విజయం సాధించారు. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.

    తుది జట్లు :

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), షిమ్రాన్ హెట్ మేయర్, లలిత్ యాదవ్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అన్రిచ్ నార్ట్జే, అవేష్ ఖాన్

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుభ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), నితీష్ రాణా, దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి, సందీప్ వారియర్
    Published by:Sridhar Reddy
    First published: