IPL 2021 - KKR Vs DC : టాప్ లేపడానికి ఢిల్లీ .. ప్లే ఆఫ్ స్ట్రాంగ్ బెర్త్ కోసం KKR..!తుది జట్లు ఇవే..!

IPL 2021 - KKR Vs DC

IPL 2021 - KKR Vs DC : ఐపీఎల్ 2021 (IPL 2021 Latest Telugu Updates) సెకండాఫ్ ఆఖరి అంకానికి చేరుకుంది. కచ్చితంగా ప్లే-ఆఫ్స్‌కు చేరుతాయ్ అనుకున్న జట్లు వరుస ఓటములు చవి చూడగా.. చెన్నై, ఢిల్లీ జట్లు సునాయాసంగా ప్లే-ఆఫ్స్‌కు చేరుకున్నాయి.

 • Share this:
  ఐపీఎల్ 2021 (IPL 2021 Latest Telugu Updates) సెకండాఫ్ ఆఖరి అంకానికి చేరుకుంది. కచ్చితంగా ప్లే-ఆఫ్స్‌కు చేరుతాయ్ అనుకున్న జట్లు వరుస ఓటములు చవి చూడగా.. చెన్నై, ఢిల్లీ జట్లు సునాయాసంగా ప్లే-ఆఫ్స్‌కు చేరుకున్నాయి. రేస్ నుంచి వైదొలిగిన సన్ రైజర్స్ (Sunrisers Hyderabad).. ఇతర జట్ల అవకాశాలను దెబ్బతీస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తి పోరుకు ధనాధన్ లీగ్ రెడీ అయింది. బలబలాల్లో సమానంగా ఉన్న రెండు జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయ్. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (DC Vs KKR) టీంల మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ జట్టు 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు కోల్‌కతా జట్టు 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రెండో దశలో ఇప్పటి వరకు ఢిల్లీ రెండు మ్యాచులాడి రెండిట్లో గెలుపొందింది. హ్యాట్రిక్ విజయం కోసం ఎదరుచూస్తోంది. మరోవైపు కోల్‌కతా టీం మూడు మ్యాచులు ఆడి రెండు విజయాలు సాధించింది. గత మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓడిపోయింది కోల్ కతా.

  హెడ్-టు-హెడ్ రికార్డులు :
  ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ 27 మ్యాచులు ఆడారు. కోల్ కతాదే అప్పర్ హ్యాండ్ గా ఉంది. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ 14, ఢిల్లీ క్యాపిటల్స్‌ 12 మ్యాచుల్లో విజయం సాధించారు. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.

  టోర్నమెంట్ మొదటి లెగ్‌లో చూపించిన జోరునే ఢిల్లీ క్యాపిటల్స్రెండో దశలోనూ కొనసాగిస్తోంది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. అలాగే బౌలర్లు కూడా బంతితో రాణించడంతో వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి రిషబ్ పంత్ నేతృత్వంలోని జట్టు ఎలాంటి తప్పులు చేయడం లేదు. శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో ఢిల్లీ జట్టు మరింత బలపడింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షాలు కూడా ఫామ్ లోకి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ కు తిరుగుండదు. మిడిలార్డర్ లో పంత్, శ్రేయస్ అయ్యర్, హెట్ మేయర్ లతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది.

  ఇక, ఢిల్లీ బౌలింగ్ లైనప్ ఈ టోర్నీలోనే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సౌతాఫ్రికా ద్వయం కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే వేగవంతమైన బంతుల్ని సంధిస్తూ ప్రత్యర్ధుల ఆట కట్టిస్తున్నారు. అశ్విన్, అక్షర్ పటేల్ మిడిల్ ఓవర్లలో పరుగుల్ని కట్టడి చేయడమే కాకుండా.. వికెట్లు కూడా తీస్తున్నారు.

  మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సెకండాఫ్ లో దూసుకుపోతుంది. వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఐపీఎల్ ఫేజ్ 2 లో సరికొత్త యువ బ్యాట్స్‌మెన్‌ ఆ జట్టుకు దొరికాడు. 26 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటివరకు కేవలం 3 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అతను బ్యాట్‌తో విలువైన పరుగులు సాధిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. యూఏఈలో అయ్యర్ 3 మ్యాచ్‌ల్లో 112 పరుగులు చేశాడు. 155.55 స్ట్రైక్ రేట్‎‌తో పరుగులు చేస్తూ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు.

  రెండవ దశలో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 2 మ్యాచులు గెలిచింది.వెంకటేశ్ అయ్యర్‌తో పాటు, రాహుల్ త్రిపాఠి కూడా కేకేఆర్‌కు మంచి భాగస్వామ్యాలు అందిస్తున్నాడు. ఫేజ్ 2 లో ఆడిన 2 ఇన్నింగ్స్‌లలో 119 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచులో కేకేఆర్ టీం 2 వికెట్ల తేడాతో ఓడిపోయారు. చివరి బంతి వరకు కేకేఆర్ టీం పోరాడింది. బౌలింగ్ లో సునీల్ నరైన్, వరుణ్ ధావన్ లు తమ మిస్టరీ బాల్స్ తో ప్రత్యర్ధులకు చెక్ పెడుతున్నారు.

  ఇది కూాడా చదవండి : ఇదేం బాదుడు సామీ..! స్టేడియం అవతల బంతి.. క్రికెట్ హిస్టరీలోనే భారీ సిక్సర్..! (వీడియో)

  పిచ్ రిపోర్ట్:
  షార్జాలో తక్కువ బౌండరీలు ఉన్నప్పటికీ, రన్-స్కోరింగ్ అంత ఈజీ కాదు. పిచ్‌ చాలా స్లోగా ఉంది. దీంతో పరుగులు చేయడానికి బ్యాటర్లు ఇబ్బందులు పడుతున్నారు. మైదానం చిన్నదే అయినా బౌండరీలు సాధించలేకపోవడానికి కారణం ఇదే. అయితే క్రీజులో బ్యాట్స్‌మెన్స్ కుదురుకుంటే పరుగులు సాధించడం అంత తేలికేం కాదు.

  కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు అంచనా: శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, షకీబ్ అల్ హసన్/ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

  ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు అంచనా: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), లలిత్ యాదవ్, షిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, అవేష్ ఖాన్
  Published by:Sridhar Reddy
  First published: