KKR vs CSK : థ్రిల్లింగ్ మ్యాచ్ లో చెన్నైదే విక్టరీ.. కమిన్స్, రస్సెల్ ల మెరుపులు వృధా..

KKR vs CSK : థ్రిల్లింగ్ మ్యాచ్ లో చెన్నైదే విక్టరీ.. కమిన్స్, రస్సెల్ ల మెరుపులు వృథా..

KKR vs CSK : వాటే ఏ మ్యాచ్ .. వాటే ఏ మ్యాచ్.. 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కోల్ కతా చివరి దాకా పోరాడింది. ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్ , దినేశ్ కార్తీక్ లు సిక్సర్ల వర్షం కురిపించారు. కానీ, చివరికి చెన్నైనే విజేతగా నిలిచింది.

  • Share this:
    ముంబై వేదికగా జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. 18 పరుగుల తేడాతో కోల్ కతా పై నెగ్గింది ధోనీసేన. 34 బంతుల్లో 66 పరుగుల ప్యాట్ కమిన్స్.. సూపర్ ఇన్నింగ్స్ వృథా అయింది. దీపక్ చాహర్ నాలుగు, ఎంగిడి మూడు వికెట్లతో సత్తా చాటారు. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. చాహర్‌ బౌలింగ్‌లో ఎంగిడి క్యాచ్‌ పట్టడంతో గిల్‌ పెవిలియన్‌ బాటపట్టక తప్పలేదు. ఆ తర్వాత కేకేఆర్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ నితీశ్‌ రాణాను(12 బంతుల్లో 9; 2 ఫోర్లు) కూడా ఔట్‌ చేసి కేకేఆర్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు చాహర్. ఆ తర్వాత తాను వేసిన మూడో ఓవర్ లో కీలకమైన మోర్గాన్‌(7 బంతుల్లో 7; ఫోర్‌) వికెట్‌ను తీసి కేకేఆర్‌ను చావుదెబ్బ కొట్టాడు దీపక్ . చాహర్‌ వేసిన 5వ ఓవర్‌ ఆఖరి బంతికి నరైన్‌(3 బంతుల్లో 4; ఫోర్‌) కూడా పెవిలియన్‌ బాట పట్టడంతో చాహర్‌ సీజన్‌లో రెండో సారి నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఎంగిడి బౌలింగ్‌లో ధోని ముచ్చటగా మూడో క్యాచ్‌ అందు​కోవడంతో కేకేఆర్‌ 31 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌ను దాదాపు చేజార్చుకుంది. అయితే.. రస్సెల్, కార్తీక్, ప్యాట్ కమిన్ ఐడియాలు వేరేలా ఉండటంతో పరుగుల వరద పారింది. కేకేఆర్‌ గెలుపుపై దాదాపు ఆశలు వదులుకున్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చి సిక్సర్ల సునామీ సృష్టించిన డేంజర్‌ మ్యాన్‌ అండ్రీ రసెల్‌(22 బంతుల్లో 54; 3 ఫోర్లు, 6 సిక్సర్లు)... సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

    ఆ తర్వాత కార్తీక్ కూడా 24 బంతుల్లో 40 పరుగులు చేసి ఎంగిడి బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే, అక్కడే ప్యాట్ కమిన్స్ షో మొదలైంది. సూపర్ బ్యాటింగ్ తో రెచ్చి పోయాడు ఈ ఆస్ట్రేలియన్. సామ్ కర్రన్ వేసిన 16 వ ఓవర్ లో ఏకంగా మూడు పరుగులు పిండుకున్నాడు. అతని దెబ్బకి సామ్ కర్రన్ ముఖం చిన్నబోయింది. ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 23 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో ఇద్దరూ బ్యాట్స్ మెన్ రనౌట్లు అవ్వడంతో చెన్నై విక్టరీ కొట్టింది.

    అంతకు ముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ ‌(95 నాటౌట్‌: 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (64: 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ) వీరవిహారం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. మొయిన్‌ అలీ (25: 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (17: 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ ) కూడా మెరవడంతో కోల్‌కతా లక్ష్యం 221గా ఉంది. కోల్‌కతా బౌలర్లలో చక్రవర్తి, రసెల్, నరైన్ తలో వికెట్ పడగొట్టారు. కోల్‌కతా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ తన నాలుగు ఓవర్లలో 58 పరుగులు ఇవ్వడం విశేషం.
    Published by:Sridhar Reddy
    First published: