• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 KKR VS CSK LIVE UPDATES CHENNAI SUPER KINGS SETS HUGE TOTAL ON BOARD SRD

KKR vs CSK : దంచుడే దంచుడు..చెన్నై సూపర్ కింగ్స్ విజిల్ పోడు..KKR టార్గెట్ ఎంతంటే..

KKR vs CSK : దంచుడే దంచుడు..చెన్నై సూపర్ కింగ్స్ విజిల్ పోడు..KKR టార్గెట్ ఎంతంటే..

KKR vs CSK : దంచుడే దంచుడు..చెన్నై సూపర్ కింగ్స్ విజిల్ పోడు..KKR టార్గెట్ ఎంతంటే..

KKR vs CSK : గత సీజన్ లో పేలవ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తో ఈ సారి రెచ్చిపోతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో గెలిచిన ధోనీసేన.. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ సెట్ చేసింది.

  • Share this:
    ముంబై వేదికగా జరుగుతున్న పోరులో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు. దీంతో పరుగుల వరద పారింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. డుప్లెసిస్ 60 బంతుల్లో 95 పరుగులు చేశాడు. వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ తలో ఓ వికెట్ తీశారు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన చెన్నైకి ఓపెనర్లు సూపర్ స్టార్ ని అందించారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ చెలరేగి ఆడటంతో చెన్నై పటిష్ట స్కోరు చేయగలిగింది. వీరిద్దరి దూకుడుకి కేవలం 5.3 ఓవర్లలోనే ఆ జట్టు 50 పరగులు పూర్తి చేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన రుతురాజ్‌ ఈ మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అర్ధసెంచరీ సాధించాడు. రుతురాజ్‌ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ సీజన్‌ తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అతనికి డుప్లెసిస్ సహకారం కూడా లభించింది. దీంతో ఇద్దరూ వంద పరుగులకు పైగా విలువైన పార్టనర్ షిప్ ని నెలకొల్పారు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రుతురాజ్‌(42 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఎట్టకేలకు ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. అర్ధశతకం తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

    అతనికి అండగా మొయిన్ అలీ కూడా బ్యాట్ కు పని చెప్పడంతో పరుగులు వేగంగా వచ్చాయ్. అయితే, 12 బంతుల్లో 25 పరుగులు చేసిన అలీనీ సునీల్ నరైన్ తెలివిగా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ధోనీ.. తన స్టామినా ఏంటో చూపాడు. వరుసగా బౌండరీలు కొట్టి తన టీమ్ కు భారీ స్కోరు అందించాడు. 8 బంతుల్లో 17 పరుగులు చేశాడు మిస్టర్ కూల్. ఐపీఎల్‌లో చెన్నై, కోల్‌కతా హెడ్ టు హెడ్ రికార్డుల్ని గమనిస్తే.. చెన్నై టీమ్‌దే ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడగా.. 14 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించింది. 9 మ్యాచ్‌లకిగానూ 8 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందగా.. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ చెరొక మ్యాచ్‌లో గెలుపొందాయి.

    రెండు జట్లు గతేడాది ప్లే ఆఫ్ చేరలేదు. ఈ సీజన్లో తలపడడం ఇదే మొదటిసారి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన చెన్నై ఉత్సాహంతో ఉండగా, వరుసగా రెండింటిలో ఓటమితో కోల్‌కతా ఒత్తిడిలో ఉంది. చెన్నైతో పోరులో గెలవాలని మోర్గాన్‌సేన పట్టుదలతో ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు