Home /News /sports /

IPL 2021 KKR PLAYER DINESH KARTHIK SPEAKS IN TELUGU FLUENTLY AND AP TS FANS ARE IMPRESSED WATCH VIRAL VIDEO SRD

Viral Video : దినేశ్ మామ నువ్వు కేక.. తెలుగులో అదరగొట్టిన కార్తీక్.. ఫ్యాన్స్ ఫిదా..!

Dinesh Karthik (PC : Twitter)

Dinesh Karthik (PC : Twitter)

Viral Video : ఐపీఎల్ తెలుగు పరిమళలు గుబాలించాయ్. కేకేఆర్ ఆటగాడు దినేశ్ కార్తీక్.. తెలుగులో అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

    ఐపీఎల్‌-2021 సీజన్ (IPL 2021 Season Latest News) లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ (Chennai Super Kings) ఛాంపియ‌న్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. దుబాయ్ వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ (Kolkata Knight Riders) ను 27 ప‌రుగుల తేడాతో ఓడించింది. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే ఈ ఫైన‌ల్ మ్యాచ్ కంటే ముందు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కీప‌ర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) తెలుగులో మాట్లాడి.. తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచిపోయాడు. అది కూడా అచ్చ‌మైన తెలుగులో అన‌ర్గ‌ళంగా మాట్లాడటంతో దినేష్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్ లో ప్ర‌ముఖ వ్యాఖ్యాత హ‌ర్షా భోగ్లే (Harsha Bhogle) దినేష్ కార్తీక్‌ను ఇంట‌ర్వ్యూ చేశాడు.

    తెలుగులో మాట్లాడడం అంటే ఏదో మొహమాటానికి వచ్చీ రాని రెండు మూడు వ్యాఖ్యలు మాట్లాడి, ఊరుకోవడం కాదు... అచ్చు తెలుగువాడిలా ఆసాంతం తెలుగులోనే సమాధానాలు ఇచ్చాడు దినేశ్ కార్తీక్. తమిళనాడులో జన్మించిన దినేశ్ కార్తీక్‌, ఇంగ్లాండ్ టూర్‌లో ఇంగ్లీష్ కామెంటరీతో అక్కడి వారి హృదయాలను గెలుచుకుని, పోలింగ్‌లో బెస్ట్ కామెంటేటర్‌ అవార్డు కూడా గెలిచాడు. కార్తీక్‌తో తెలుగుతో పాటు హిందీ, మాతృభాష తమిళ్ కూడా అనర్గళంగా మాట్లాడగలడు.

    ఇక, ఇంటర్వ్యూలో మెగా ఫైనల్‌ ఒత్తిడి ఉందా అని హర్షా అడిగిన ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదన్నాడు. సాధారణ మ్యాచ్‌లానే ఈ మ్యాచ్‌ను భావిస్తున్నామంటూ తడబడకుండా టక్కున తెలుగులో చెప్పేశాడు. ఫైనల్ మ్యాచ్‌ అనగానే.. ఒత్తిడి ఉంటుందని, దాన్ని అధిగమించేందుకు ప్రాక్టీస్ చేశామన్నాడు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. జట్టు సెకండాఫ్‌లో అద్భుతంగా రాణించిందని తెలిపాడు. ఫైనల్‌కు చేరేందుకు కేకేఆర్ ఆటగాళ్లు బాగా కష్టపడ్డారని దినేశ్ చెప్పుకొచ్చాడు.


    దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడటంపై తెలుగు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డీకే అచ్చం తెలుగువాడిలా అద్భుతంగా మాట్లాడిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. హర్షా భోగ్లే సైతం డీకేను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తెలుగు ఇంటర్వ్యూ చేస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నాడు. 2020 ఐపీఎల్‌ లో కూడా దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించాడు.


    ఇదిలా ఉంటే, డీకే.. 2020 ఐపీఎల్‌ సందర్భంగా కూడా తెలుగులో మాట్లాడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్ లో అంపైర్ హైదరాబాద్ అంపైర్ షంషుద్దీన్ తో మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ గా మారాయ్.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai Super Kings, Cricket, Dinesh Karthik, IPL 2021, Kolkata Knight Riders

    తదుపరి వార్తలు