IPL 2021 : నా ఫేవరెట్ హీరో నాని..చెన్నై జట్టులోకి ఎంపికయ్యాక జెర్సీలో నానిలా ఏడ్చేశా..

Photo Credit : Twitter

IPL 2021 : ప్రతి ఒక్క క్రికెటర్ కల..జాతీయ జట్టుకు ఆడటం. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ కుర్రాళ్ల కలల నెరవేరుతున్నాయ్. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది యంగ్ క్రికెటర్లు సత్తా చాటి.. జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అందుకే, ముందుగా ఐపీఎల్ (IPL 2021) లో చోటు దక్కించుకోవాలని కలలు కంటారు యంగ్ క్రికెటర్లు.

 • Share this:
  ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ మినీ వేలంలో రూ.20 లక్షల కనీస ధరతో కడపకు చెందిన హరిశంకర్‌ రెడ్డి (Harishankar Reddy) వేలంలోకిరాగా.. అదే ధరకి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్ లో తన బౌలింగ్ తో ధోనీని (Ms Dhoni) కూడా ఇబ్బంది పెట్టాడు ఈ తెలుగు తేజం. అయితే.. ఐపీఎల్ 2021 మినీ వేలానికి ఎంపికైనప్పుడు..తాను కూడా (Nani)ఏడ్చానని తెలుగు క్రికెటర్ హరిశంకర్ రెడ్డి తెలిపాడు. రెండేళ్ల కింద‌ట వ‌చ్చిన నేచుర‌ల్ స్టార్, టాలీవుడ్ హీరో నాని సినిమా జెర్సీ (Jersey) క్రికెట్ నేప‌థ్యంలోనే న‌డుస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అందులో కొన్ని స‌న్నివేశాలు ఎంత ఉద్వేగ‌భ‌రితంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ముఖ్యంగా త‌న‌కు రంజీ జ‌ట్టులో చోటు ద‌క్కాక‌.. నాని వెళ్లి రైల్వే స్టేష‌న్‌లో ట్రైన్ శ‌బ్దం మాటున గ‌ట్టిగా అరుస్తూ భావోద్వేగానికి గుర‌య్యే స‌న్నివేశం ప్రేక్ష‌కుల‌పై చెర‌గ‌ని ముద్ర వేసింది. జీవితంలో ఒక గొప్ప విజ‌యం సాధించిన సంద‌ర్భంలో అలాంటి భావ‌న‌కే గుర‌వుతారు అంద‌రూ. అలాగే హరిశంకర్ రెడ్డి కూడా ఉద్వేగానికి లోనయ్యాడట. ఈ విషయాన్ని స్వయంగా హరిశంకర్ రెడ్డి తెలిపాడు.ఐపీఎల్ వేలానికి ఎంపికయ్యావని చెప్పగానే సహచర ఆటగాళ్లంతా అభినందించారని, కానీ తనకు మాత్రం జెర్సీ సీన్ గుర్తొచ్చిందన్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 2021 సీజన్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న అత‌ను.. తాజాగా చెన్నై మీడియం టీమ్‌తో సంభాషించాడు.

  ఈ సంద‌ర్భంగా తెలుగులోనే మాట్లాడుతూ.. జెర్సీ సినిమాను గుర్తుకు తెచ్చుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే షేర్ చేసింది. అంతేకాకుండా ఈ వీడియో నాని చూడాలని కోరింది. దీనికి నాని చూసేశా అని బదులిస్తూ.. లవ్ ఏమోజీతో రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
  ఈ వీడియోలో హరిశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. "జెర్సీ సినిమాతో నేను ఎంత‌గానో క‌నెక్ట్ అయ్యాను.. క్రికెట‌ర్ల భావోద్వేగాల‌ను ఆ సినిమాలో చాలా బాగా చూపించారు. ముఖ్యంగా ట్రైన్ సీన్ చూసి నేను చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను. సాధారణ ప్రజలకు ఆ సీన్ ఓవరాక్షన్‌లా ఉండొచ్చు. కానీ క్రికెటర్లకు ఆ బాధ ఏంటో తెలుసు. నేను ఐపీఎల్ వేలానికి ఎంపికైనప్పుడు సహచర ఆటగాళ్లంతా అభినందించారు. కానీ నేను రూమ్‌లో వెళ్లి ‘అమ్మా'అని గట్టిగా అరిచా. ఇది కలా? నిజమా? అని తెలియలేదు. ఆ క్షణం నాకు జెర్సీ సినిమాలోని సీన్ గుర్తొచ్చింది." అని చెప్పుకొచ్చాడు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన హరిశంకర్​ రెడ్డి ఆంధ్ర టీమ్ త‌ర‌ఫున దేశ‌వాళీ క్రికెట్లో స‌త్తా చాటిన చెన్నై సూప‌ర్ కింగ్స్ దృష్టిని ఆక‌ర్షించాడు. ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో సీఎస్‌కే అతన్ని రూ. 20 లక్షల కనీధరకు కొనుగోలు చేసింది. ఇటీవల జట్టు ప్రాక్టీసులో భాగంగా అతడు ఏకంగా కెప్టెన్ ధోనీనే బౌల్డ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ ఏడాది అతనికి తుదిజట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.
  Published by:Sridhar Reddy
  First published: