ఐపీఎల్ 2021(IPL 2021) సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ వేదికను యూఏఈకు మార్చారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి మ్యాచ్ లు షురూ కానున్నాయి. ఇందుకోసం ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్ జట్టులోని వాళ్లు..ఇప్పటికే యూఏఈకి చేరుకున్నారు. దీంతో ఐపీఎల్ సందడి షూరు అయింది. ఈ నేపథ్యంలో టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చానల్ ఆసక్తికర ప్రచార వీడియోను పంచుకుంది.ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ వెరైటీ గెటప్పుతో దర్శనమిచ్చాడు. జుట్టుకు రంగు, ఫ్యాషనబుల్ డ్రెస్సుతో హుషారుగా గెంతుతూ వినోదం పండించాడు. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ వస్తోందని, తుపానులా ఉంటుందని ధోనీ పేర్కొనడం ఈ వీడియోలో చూడొచ్చు. ఫస్టాఫ్ ను మించిన థ్రిల్ ఖాయమని, క్లైమాక్స్ అదిరిపోతుందని ఓ సినిమా లెవల్లో పబ్లిసిటీ ఇచ్చాడు. మిమ్మల్ని అలరించడానికి గబ్బర్, హిట్ మ్యాన్ ఉన్నారంటూ ధోనీ ఈ వీడియోలో పేర్కొన్నాడు. ‘అస్లీ పిక్చర్ అభీ బాకీ హై’ అంటూ సాగే ఈ ప్రచార గీతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
??? - #VIVOIPL 2021 is BACK and ready to hit your screens once again!
Time to find out how this blockbuster season concludes, 'coz #AsliPictureAbhiBaakiHai!
Starts Sep 19 | @StarSportsIndia & @DisneyPlusHS pic.twitter.com/4D8p7nxlJL
— IndianPremierLeague (@IPL) August 20, 2021
ఇక, టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ట్రెండ్ సెట్టర్ గానే ఉంటాడు. అతను ఏం చేసినా.. ప్రత్యేకమే. అందుకే క్రికెట్‌కు గుడ్ బై చెప్పినప్పటికీ అతని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ఐపీఎల్ ద్వారా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం ఏదోరకంగా ట్రీట్ ఇస్తూనే ఉంటాడు. ఇక, ఈ ప్రచార వీడియోను చూసిన ధోనీ అభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ధోనీ అభిమానులు అయితే, అమితమైన ప్రేమను చూపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఏక్ ధమ్ ఉన్నవ్ మహీ భాయ్’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఫంకీ హెయిర్ స్టైల్ లో ధోనీ లుక్ అభిమానుల్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభం కాగా.. కరోనా వైరస్ వ్యాప్తితో వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేస్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి మొదలవ్వనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Cricket, IPL 2021, MS Dhoni, Sports, Star sports