Home /News /sports /

IPL 2021 GOOD NEWS TO FANS WELCOMES FANS BACK TO THE STADIUMS SU

IPL 2021: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌కి ఎంట్రీ.. ఆన్‌లైన్‌లో టికెట్లు ఎప్పటి నుంచి అంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్రికెట్ అభిమానులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. ఐపీఎల్ 2021 మ్యాచ్‌లకు అభిమానులను అనుమతిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది.

    క్రికెట్ అభిమానులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. ఐపీఎల్ 2021 మ్యాచ్‌లకు అభిమానులను అనుమతిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది. కరోనా కారణంగా ఐపీఎల్ 2021కు(IPL 2021) మధ్యలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్నాయి. కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్‌ కింగ్స్(Chennai Super Kings) మ్యాచ్ అభిమానుల సందడి మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌తో పాటు టోర్నిలో మిగిలిన మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు సెప్టెంబర్ 16 నుంచి ఆన్‌లైన్ అందుబాటులో ఉండనున్నాయి.అధికారిక వెబ్‌సైట్ www.iplt20.com తో పాటుగా PlatinumList.netలో కూడా టికెట్స్ అందుబాటులో ఉండనున్నట్టుగా బీసీసీఐ తెలిపింది.

    ఐపీఎల్ సీజన్ 14లో ఇండియా వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మధ్యలో కరోనా ఎఫెక్ట్‌తో బీసీసీఐ టోర్నిని మధ్యలో వాయిదా వేసింది. తర్వాత సెకండాఫ్‌ను యూఏఈలో నిర్వహించనున్నట్టుగా ప్రకటించింది. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్‌లలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

    ఈ టోర్నిలో మిగిలిన మ్యాచ్‌లు దుబాయ్, షార్జా, అబుదాబి వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. అయితే కోవిడ్ నిబంధనలు, యూఏఈ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా పరిమిత సిట్టింగ్‌తో అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు.





    ఇక, 2020లో జరిగిన ఐపీఎల్ 13వ  సీజన్ అభిమానుల సందడి లేకుండానే సాగిన సంగతి తెలిసిందే.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: IPL, IPL 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు