ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభించడంపై బీసీసీఐ పూర్తి స్థాయిలో దృష్టి సాధించింది. మిగితా మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే ఈ మ్యాచ్‌లకు
పేక్షకులను అనుమతించాలని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఐపీఎల్ 2020ని యూఏఈ వేదికగా జరిగిన టోర్నీని ఖాళీ స్టేడియాలలో నిర్వహించారు. ఈ సారి అభిమానులకు అనుమతి ఇవ్వాలని ఆ దేశ క్రీడా శాఖ అభిప్రాయపడుతుంది. ఈ నిర్ణయం అశమాశిగా తీసుకోలేదు. ప్రస్తుతం యుఏఈలో కరోనా అదుపులోనే ఉండటం.. దాదాపు 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అవడంతో ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
అయితే ప్రేక్షకులను ఎంత శాతంలో అనుమతి ఇవ్వాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. తాజా సమాచారం ప్రకారం
ప్రతి మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్షకులు అనుమతించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక బీసీసీఐ సెకండాఫ్ మ్యాచ్‌ల నిర్వహణ సంబంధించి ఈసీబీ అధికారులతో త్వరలో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రేక్షకులను అనుమతించడంపై చర్చించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.