• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 GLENN MAXWELL TROLLED BY NETIZENS AFTER SCORES 1ST IPL FIFTY IN 5 YEARS SRD

Glenn Maxwell : ఐదేళ్ల తర్వాత మ్యాక్సీ హాఫ్ సెంచరీ..గాలి తీసేస్తున్న నెటిజన్లు..

Glenn Maxwell : ఐదేళ్ల తర్వాత మ్యాక్సీ హాఫ్ సెంచరీ..గాలి తీసేస్తున్న నెటిజన్లు..

Glenn Maxwell (Photo Credit : Twitter)

Glenn Maxwell : గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ తరపున మ్యాక్స్‌వెల్ ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లాడి 108 పరుగులు మాత్రమే చేశాడు. మ్యాక్సీ తీవ్రంగా నిరాశపరచడంతో పంజాబ్‌ జట్టు అతన్ని రిలీజ్‌ చేసింది. ఐపీఎల్ 2021 వేలంలో బెంగళూరు మాక్స్‌వెల్‌ను రూ.14.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇప్పుడు బెంగళూరు జట్టులోకి రాగానే అతని ఆటతీరు మారిపోయింది.

  • Share this:
    ఐపీఎల్ 2021 సీజన్‌లో కోహ్లీసేన రెండో విజయాన్ని అందుకుంది. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌‌కు ది బెస్ట్ ఫీల్డింగ్‌తో రాణించి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఆరెంజ్ ఆర్మీతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)కి ఫైటింగ్ టోటల్ ని అందించాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell) (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో అర్ధ శతకం నమోదు చేశాడు. మ్యాక్స్‌వెల్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఐదేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ చేయడంపై నెటిజన్లు మ్యాక్సీనీ ఓ ఆటాడుకుంటున్నారు. పంజాబ్ కింగ్స్ లో ఉన్నప్పుడు ఏమీ చేయలేని మ్యాక్సీ.. జట్టు మారగానే రెచ్చిపోతున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే.. రకరకాల పోలీకలతో మ్యాక్స్ వెల్ పై ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ప్రీతి జింటాకు మ్యాక్స్ వెల్ దొరకాలి.. అతడి పని అయిపోవడం గ్యారెంటీ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

    గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ తరపున మ్యాక్స్‌వెల్ ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లాడి 108 పరుగులు మాత్రమే చేశాడు. మ్యాక్సీ తీవ్రంగా నిరాశపరచడంతో పంజాబ్‌ జట్టు అతన్ని రిలీజ్‌ చేసింది. ఐపీఎల్ 2021 వేలంలో బెంగళూరు మాక్స్‌వెల్‌ను రూ.14.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇప్పుడు బెంగళూరు జట్టులోకి రాగానే అతని ఆటతీరు మారిపోయింది. రెండు మ్యాచ్ ల్లోనూ బ్యాటింగ్ తో రాణించాడు.










    దీంతో మ్యాక్సీపై పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఇదేందయ్యా మ్యాక్సీ.. అప్పుడు నీవు బ్యాటింగ్ చేయడమే మర్చిపోయావు. ఇప్పుడు చితక్కొట్టేస్తున్నావ్ అని ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్ అమెరికా క్యారెక్టర్లతో పోలుస్తూ మ్యాక్స్ వెల్ గాలి తీసేస్తున్నారు. ఇంకా వదలిపెట్టకుండా మోనాలీసా ఫోటోలతో కూడా ఓ ఆటాడుకుంటున్నారు. మొత్తానికి గ్లెన్ మ్యాక్స్ వెల్.. ఈ సీజన్ లో రాణించడం ఆర్సీబీ ఫ్యాన్స్ కు పండుగలా అన్పిస్తే.. పంజాబ్ కింగ్స్ కు మాత్రం ఇది కొంచెం బాధను కలిగిస్తోంది. మ్యాక్సీ రాకతో ఆర్సీబీ రాత కూడా మారినట్టుంది. ఈ సీజన్ లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ విక్టరీలు కొట్టి ఫుల్ జోష్ లో ఉంది. కోహ్లీసేనకు మ్యాక్స్ వెల్ బ్యాక్ బోన్ లా మారి ఫినిషర్ రోల్ ప్లే చేస్తున్నాడు. మ్యాక్స్ వెల్ ఇదే ఫామ్ భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కొట్టడం ఖాయమంటున్నారు క్రీడా పండితులు.
    Published by:Sridhar Reddy
    First published: