IPL 2021 Final Match : చెన్నైకి సవాల్ విసురుతోన్న కేకేఆర్.. ఇరు జట్ల రికార్డులు, తుది జట్లు ఇవే..!

IPL 2021 Final Match

IPL 2021 Final Match : ఎడారిలో అసలు సిసలు కొదమ సింహాల పోరుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి కొద్ది గంటల్లో ఐపీఎల్ 14 వ సీజన్ విజేత ఎవరో తేలనుంది.

 • Share this:
  ఐపీఎల్ 2021 సీజన్‌ (IPL 2021 Season Latest News) క్లైమాక్స్‌కి చేరుకుంది. ఐపీఎల్ 14 వ సీజన్ విజేత ఎవరో మరి కొద్ది గంటల్లో తేలనుంది. మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్, ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్ ఫైట్‌లో (IPL 2021 Final Match CSK Vs KKR) టైటిల్ కోసం తలబడబోతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి 7.30 గంటలకి టైటిల్ పోరు జరగనుంది. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కి చేరడం ఇది తొమ్మిదోసారికాగా.. ఆ జట్టు ఇప్పటికే మూడు సార్లు టైటిల్ గెలిచింది. అలానే కోల్‌కతా ఫైనల్‌కి చేరడం ఇది మూడో సారికాగా.. ఇంతకముందు ఫైనల్‌కి చేరిన రెండు సార్లూ ఆ జట్టు టైటిల్ విజేతగా నిలవడం గమనార్హం.

  ఐపీఎల్ ఫైనల్లో ఇప్పటి వరకూ కేవలం ఒకే ఒక సందర్భంలో.. అదీ 9 ఏళ్ల క్రితం చెన్నై, కోల్‌కతా జట్లు ఢీకొన్నాయి. 2012లో అంచనాలకి మించి రాణించిన కోల్‌కతా.. చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో చెన్నైపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ని ముద్దాడింది. ఆ తర్వాత 2014లోనూ ఫైనల్‌కి చేరిన కోల్‌కతా.. పంజాబ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచి రెండోసారి టైటిల్‌ని కైవసం చేసుకుంది. దీంతో, ఈ రికార్డును కంటిన్యూ చేస్తూ.. చెన్నై దూకుడుకు కళ్లెం వేయాలని కోల్ కతా నైట్ రైడర్స్ భావిస్తోంది.

  మరోవైపు, గతేడాది ఘోర ప్రదర్శనకు చెక్ పెడుతూ.. దుమ్మురేపిన ధోనీ సేన.. నాలుగో టైటిల్ గెలిచి విజిల్ వేయాలని ప్రయత్నిస్తోంది. సీఎస్‌కే జట్టుకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, మిడిల్ ఆర్డర్‌లో అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప ప్రధాన బలంగా మారారు. ముఖ్యంగా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నారు. వీరిద్దరూ మరోసారి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

  ఇక, గత మ్యాచ్ లో ధోనీ ఫామ్ లోకి రావడం చెన్నైకి ప్లస్ పాయింట్. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి తన స్టామినాను చూపించాల్సిన అవసరం లేదు. ఈ లీగ్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్లలో రవీంద్రుడు ఒకడు. బౌలింగ్ విభాగంలో జోష్ హజెల్ వుడ్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో కీలకం కానున్నారు. స్పిన్ విభాగంలో మొయిన్ అలీ, రవీంద్ర జడేజాలు సత్తా చాటాల్సిన అవసరం ఉంది.

  ఇది కూడా చదవండి : పాక్ జట్టును టీజ్ చేస్తోన్న మౌకా మౌకా యాడ్..! భారత్ ఫ్యాన్స్ కు పండుగే..

  అలాగే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కూడా సెకండాఫ్‌లో అద్భుత విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టింది. వికెట్ల వెనకాల దినేశ్ కార్తీక్, డగౌట్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్, బ్యాటింగ్‌లో వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, బౌలింగ్‌లో సునీల్ నరైన్, లూకీ ఫర్గూసన్, శివమ్ మావి వంటి ప్లేయర్ల పర్ఫామెన్స్ కారణంగా కేకేఆర్ ఫైనల్ చేరింది.

  వీరందరూ మరోసారి సత్తా చాటితే కోల్ కతాకు తిరుగుండదు. అయితే, కెప్టెన్ మోర్గాన్ వైఫల్యం ఆ జట్టును బాధిస్తోంది. ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత దారుణమైన సగటు నమోదుచేసిన కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన ఇయాన్ మోర్గాన్, 2021 సీజన్‌లో 10 సార్లు సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయాడు.

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  ఐపీఎల్ లో ఓవరాల్ గా 27 మ్యాచ్ ల్లో తలపడగా.. చెన్నై సూపర్ కింగ్స్ దే పై చేయి. ధోనీ సేన 17 మ్యాచ్ ల్లో నెగ్గగా.. కేకేఆర్ టీమ్ కేవలం 9 మ్యాచ్ ల్లో మాత్రమే గెలిచింది. ఇక, యూఏఈ గడ్డపై మూడు సార్లు తలపడ్డాయ్. రెండు సార్లు చెన్నై నెగ్గగా.. కోల్ కతా ఒక మ్యాచ్ లో విక్టరీ కొట్టింది.

  తుది జట్లు అంచనా :

  చెన్నై సూపర్‌కింగ్స్‌: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, రాబిన్‌ ఉతప్ప, ధోనీ(కెప్టెన్‌), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్‌ ఠాకూర్, దీపక్‌ చహర్, హాజెల్‌వుడ్‌.

  కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ గిల్, వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌ (వికెట్ కీపర్), షకిబ్‌ ఉల్ హాసన్, సునీల్ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, లుకీ ఫెర్గూసన్‌, శివమ్ మావి.
  Published by:Sridhar Reddy
  First published: