MS Dhoni : " ధోనీ నువ్వు ఎక్కడుంటే మేము కూడా అక్కడే " .. తలా క్రేజే వేరప్పా..!

Photo Credit : Twitter

MS Dhoni : భారత్ లో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తర్వాత అంతటి ఆదరణ సంపాదించింది కచ్చితంగా మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni)నే. లెజెండరీ కెప్టెన్‌‌ మహేంద్ర సింగ్‌‌ ధోనీకి కోట్లాది మంది ఫ్యాన్స్​ ఉన్నారు.

 • Share this:
  క్రికెట్(Cricket) అంటేనే ఓ అద్భుతం అంటారు. ఇక, భారతదేశంలో ఈ జెంటిల్ మేన్ గేమ్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. భారత్ లో క్రికెట్ ఓ మతం. అది సీనియర్ లెవల్ అయినా, జూనియర్ క్రికెట్ అయినా విజయం సాధిస్తే ఓ రేంజిలో సంబరాలు చేస్తుంటారు. ఇక, 1983 వరల్డ్ కప్ (World Cup) తర్వాత క్రికెట్ ప్రపంచంలో భారత్ కు ఉండే క్రేజే తారాస్థాయికి చేరింది. ఆ మెగాటోర్నీ విజయం కోట్లాది భారతీయుల్లో క్రికెట్ ను ఓ మతంలా మార్చింది. క్రికెటర్లును దేవుళ్లులా కొలిచే సంప్రదాయం అప్పటి నుంచే మొదలైంది. భారత్ లో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తర్వాత అంతటి ఆదరణ సంపాదించింది కచ్చితంగా మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni)నే. లెజెండరీ కెప్టెన్‌‌ మహేంద్ర సింగ్‌‌ ధోనీకి కోట్లాది మంది ఫ్యాన్స్​ ఉన్నారు. అతనంటే ప్రాణం ఇచ్చే వీరాభిమానులూ చాలా మందే కనిపిస్తారు. మహీపై ప్రేమను వాళ్లు వివిధ రూపాల్లో చూపిస్తుంటారు. ఒకరు ఒంటి నిండా మహీ టాటూస్‌‌ వేయించుకుంటే, మరొకరు ధోనీ పేరు కనిపించేలా హెయిర్‌‌ కట్‌‌ చేసుకుంటారు.

  ఓ వీరాభిమాని అయితే, మహీ కోసం ఎన్నో తిప్పలు పడి.. చెన్నై నుంచి దుబాయ్ కు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరైంది. ప్రస్తుతం ఆ అభిమానికి సంబంధించిన ఫోటో ఒకటి వైరలవుతోంది.ఆ ఫోటోలు ఆ మహిళ ఓ బ్యానర్ పట్టుకుని ఉంటుంది. ఆ బ్యానర్ లో ధోనీ నువ్వు ఎక్కడుంటే మేము కూడా అక్కేడే అని రాసి ఉంది. ఇప్పుడు ఈ వైరల్ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. ధోనీ ఫ్యాన్స్ అంటే ఇలానే ఉంటారంటూ.. తలా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

  ఐపీఎల్-14వ సీజన్ (IPL 2021 Season Updates) విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‎లో కోల్‎కతాను 27 పరుగుల తేడాతో చెన్నై ఓడించింది. కేకేఆర్ బ్యాట్స్‎మెన్స్ విఫలం కావడంతో చెన్నై చేతిలో ఘోర పరాజయాన్ని కేకేఆర్ మూటగట్టుకుంది. సీఎస్‎కే ఈ విజయంతో నాలుగోసారి ట్రోఫిని సొంతం చేసుకుంది.


  టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86) హాఫ్ సెంచరీతో రాణించగా.. మొయిన్ అలీ(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), రాబిన్ ఊతప్ప(15 బంతుల్లో 3 సిక్స్‌లతో 31) కీలక పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా.. శివం మావి ఓ వికెట్ తీశాడు.

  ఇది కూడా చదవండి : " బీ అలర్ట్.. రాహుల్ ద్రావిడ్ వస్తున్నాడు.. మిగిలిన దేశాలు జాగ్రత్తగా ఉండాల్సిందే.."

  అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 6 ఫోర్లతో 51), వెంకటేశ్ అయ్యర్(32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించినా.. ఇతర బ్యాట్స్‌మన్ వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది.
  Published by:Sridhar Reddy
  First published: