IPL 2021 Final - CSK Vs KKR : దసరా ధమాకాలో రెచ్చిపోయిన చెన్నై బ్యాటర్లు.. KKR ముందు భారీ టార్గెట్..

IPL 2021 Final - CSK Vs KKR

IPL 2021 Final - CSK Vs KKR : దసరా ధమాకాలో చెన్నై సూపర్ కింగ్స్ రెచ్చిపోయింది. ఫైనల్ లో భారీ టార్గెట్ ను సెట్ చేసి కోల్ కతా నైట్ రైడర్స్ ను ఒత్తిడిలోకి నెట్టింది.

  • Share this:
    ఐపీఎల్ 2021 ఫైనల్ (IPL 2021 Season Latest Updates) లో చెన్నై సూపర్ కింగ్ (Chennai Super Kings) బ్యాటర్లు దుమ్మురేపారు. దుబాయ్ వేదికగా జరిగిన దసరా ధమాకాలో కోల్ కతా నైట్ రైడర్స్ ముందు భారీ టార్గెట్ ను సెట్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ ( 59 బంతుల్లో 86 పరుగులు), మొయిన్ అలీ (20 బంతుల్లో 37 పరుగులు), ఊతప్ప ( 15 బంతుల్లో 31 పరుగులు), రుతు రాజ్ గైక్వాడ్ (27 బంతుల్లో 32 పరుగులు) రాణించారు. చెన్నై ఇన్నింగ్స్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf Duplesis Batting) బ్యాటింగ్ సూపర్. కెరీర్ లో 100 వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న డుప్లెసిస్ సూపర్ హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. అతనికిది ఐపీఎల్ లో 22 వ హాఫ్ సెంచరీ. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టు కేకేఆర్ బౌలర్లను ఉతికారేశారు. రుతురాజ్, డుప్లెసిస్, ఊతప్ప, మొయిన్ అలీ ఇలా ప్రతి ఒక్కరూ తమ బ్యాట్లకు పని చెప్పారు.

    టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ ల జోడి కోల్ కతా బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. దొరికిన చెత్త బంతుల్ని బౌండరీలు తరలించారు. వీరిద్దరి దూకుడు..6 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్ టీం 50 పరుగులు చేసింది. అయితే, దూకుడు మీదున్న రుతురాజ్ (32 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) రూపంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో లాంగ్‌ ఆన్‌లో శివం మావికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.


    దీంతో 61 పరుగుల సూపర్ ఓపెనింగ్ పార్టనర్ షిప్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన ఊతప్ప కూడా మెరుపులు మెరిపించాడు. ఊతప్ప (31 పరుగులు, 15 బంతులు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ కూడా మెరుపులు మెరిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ టార్గెట్ సాధించింది.

    హెడ్ టు హెడ్ రికార్డులు :
    ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించగా.. 9 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు. గత ఆరు మ్యాచుల్లో కోల్‌కతాపై చెన్నై ఐదింటిలో గెలిచింది. ఫైనల్ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న దుబాయ్ పిచ్‌.. బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉండనుంది.

    తుది జట్లు :

    చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్.

    కోల్‌కతా నైట్ రైడర్స్:

    శుభమాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.
    Published by:Sridhar Reddy
    First published: