IPL 2021 Final : వారెవ్వా రుతురాజ్.. ఆరెంజ్ క్యాప్ చెన్నై కుర్రాడిదే..! అరుదైన రికార్డు సొంతం..

Ruturaj Gaikwad

IPL 2021 Final - చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ అదరగొడుతున్నారు. స్టైలిష్ బ్యాటింగ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

  • Share this:
    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 (IPL 2021 Season Latest Updates) క్లైమాక్స్ కు చేరుకుంది. దసరా ధమాకాలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి (IPL Final CSK Vs KKR). దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కోల్ కతా నైట్ రైడర్స్. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు మరోసారి ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ సీజన్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న రుతురాజ్(Ruturaj Gaikwad).. 23 పరుగులు చేయగానే ఆరెంజ్ క్యాప్ (Orange Cap) సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ లో ఈ లిస్ట్ లో లో ఇప్పటిదాకా పంజాబ్ కింగ్స్ (Punjab kings) కెప్టెన్ కెఎల్ రాహుల్ (KL Rahul) ఉండగా.. రుతురాజ్ అతడిని అధిగమించాడు. కేఎల్ రాహుల్ 626 పరుగులతో రెండో స్థానానికి చేరాడు.

    గైక్వాడ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ శిఖర్ ధావన్ (587) మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో ఈ క్యాప్ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రుతురాజ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ షాన్ మార్ష్ పేరిట ఉంది. 2008 లో పంజాబ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మార్ష్.. ఆ సీజన్ లో 11 మ్యాచుల్లో 616 పరుగులు చేశాడు. అప్పటికీ మార్ష్ వయస్సు 25 సంవత్సరాలు. కానీ ప్రస్తుతం గైక్వాడ్ వయసు 24 ఏళ్లు మాత్రమే. ఇక, ఈ మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. 12 ఓవర్లకి ఒక వికెట్ కోల్పోయి 104 పరుగులు చేసింది చెన్నై. ఫాఫ్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీతో దుమ్మురేపుతున్నాడు. 32 పరుగులు చేసిన రుతురాజ్ నరైన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

    హెడ్ టు హెడ్ రికార్డులు :
    ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించగా.. 9 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు. గత ఆరు మ్యాచుల్లో కోల్‌కతాపై చెన్నై ఐదింటిలో గెలిచింది. ఫైనల్ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న దుబాయ్ పిచ్‌.. బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉండనుంది.

    తుది జట్లు :

    చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్.

    కోల్‌కతా నైట్ రైడర్స్:

    శుభమాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.
    Published by:Sridhar Reddy
    First published: