IPL 2021- Final: ఐపీఎల్ దక్కేది ఎవరికో? నేడే ఫైనల్.. టైటిల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ - కోల్‌కతా నైట్‌రైడర్స్ ఢీ

నేడు ఐపీఎల్ ఫైనల్.. టైటిల్ కోసం తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్ - కోల్‌కతా నైట్‌రైడర్స్ (PC: IPL)

IPL 2021 Final: ఐపీఎల్ 2021 ఫైనల్స్ నేడు దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ - కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగనున్నది. ఇరు జట్లు గతంలో ఐపీఎల్ టైటిల్స్ గెలిచాయి. చెన్నైకి్ ఇంది 9వ ఫైనల్ కాగా.. కోల్‌కతాకు మూడో ఫైనల్.

 • Share this:
  ఐపీఎల్ 2021 (IPL 2021) టైటిల్ ఎవరికి దక్కనున్నదో మరి కొన్ని గంటల్లో తెలిసిపోనున్నది. లీగ్‌లో 59 మ్యాచ్‌లు పూర్తి కాగా.. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) - కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ట్రోఫీ కోసం ఫైనల్‌లో తలపడనున్నాయి. తుది పోరులో చెన్నై, కోల్‌కతాలు నీకా నాకా అన్నట్లుగా సిద్దం అవుతున్నాయి. ఈ రెండు జట్లు సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాయి. చెన్నై జట్టు మొదటి నుంచి అంచనాలకు మించి రాణించగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం తొలి దశ కంటే యూఏఈలో జరిగిన రెండో దశలోనే అద్భుతంగా ఆడింది. చెన్నై లీగ్ దశలో 14 మ్యాచ్‌లకు గాను 9 మ్యాచ్‌లలో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై (Delhi Capitals) విజయం సాధించి నేరుగా ఫైనల్స్ చేరుకున్నది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ 14 మ్యాచ్‌లకు గాను ఏడింట విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును (Royal Challengers Bengaluru).. రెండో క్వాలిఫయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఏడేళ్ల తర్వాత ఫైనల్ చేరుకున్నది. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది 9వ సారికాగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇది మూడో సారి.

  ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశలో చివరి మూడు మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను తొలి క్వాలిఫయర్‌లో ఖంగు తినిపించింది. చెన్నై బ్యాటింగ్ లైనప్ బలంగా కనపడుతున్నది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్. ఫాఫ్ డు ప్లెసిస్ మంచి ఫామ్‌లో ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ నుంచి చెన్నై మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నది. ఇక రాబిన్ ఊతప్ప మంచి టచ్‌లోకి వచ్చాడు. కెప్టెన్ ధోని ఫినిషింగ్‌తో మైమరిపించాడు. మొయిన్ అలీ, అంబటి రాయుడు ఈ సీజన్‌లో నిరాశ పరిచారు. వారి నుంచి మంచి స్కోర్ రావల్సి ఉన్నది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్ పర్వాలేదనిపిస్తున్నారు. ఇప్పటి వరకు వారికి సరైన అవకాశం రాలేదు. అయితే బౌలింగ్‌లో మాత్రం సత్తా చాటుతున్నారు. బౌలింగ్ విభాగంలో శార్దుల్ ఠాకూర్, జోష్ హాజెల్‌వుడ్ వికెట్లు తీస్తూ జట్టును ఆదుకుంటున్నారు. అయితే వారు భారీగా పరుగులు ఇవ్వకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది.

  Team India Jerseys : 1983 నుంచి 2021 వరకు టీమిండియా జెర్సీలు ఇవే..!


  ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తొలి దశలో అంతగా ఆకట్టుకోక పోయినా.. రెండో దశలో అద్బుతంగా రాణించింది. అతి కష్టం మీద ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించినా... ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2లో అంచనాలను మించి రాణించింది. కోల్‌కతా బౌలర్లు ఆ జట్టకు విజయాలను తెచ్చిపెడుతున్నారు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ తమ మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థులను గడగడలాడిస్తున్నారు. లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి అసరమైన వికెట్లు తీస్తూ జట్టుకు తోడ్పడుతున్నారు. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇక రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా బ్యాట్‌తో ఆకట్టుకుంటున్నారు. అయితే ఇయాన్ మోర్గాన్ ఫామ్‌లో లేకపోవడం పెద్ద లోటుగా ఉన్నది. దినేశ్ కార్తీక్ నుంచి కూడా మంచి ప్రదర్శన రాలేదు. అయితే జట్టు వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ వస్తుండటంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నది. తప్పకుండా చెన్నైని ఓడించి కప్ కొట్టగలం అనే ధీమాతో ఉన్నారు.

  Viral Video : ఇదేందయ్యా ఇది.. ఒక క్యాచ్ ని ముగ్గురు పట్టారు..! కానీ, చివరికి కొంపముంచారుగా..
  ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌లో ఏనాడూ ఓడిపోలేదు. గతంలో రెండు సార్లు ఫైనల్ చేరి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికి 9 సార్లు ఫైనల్ చేరింది. కానీ కేవలం 3 సార్లు మాత్రమే విజయం సాధించి ట్రోఫీ గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌లో ఏనాడూ ఓడిపోలేదు. గతంలో రెండు సార్లు ఫైనల్ చేరి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికి 9 సార్లు ఫైనల్ చేరింది. కానీ కేవలం 3 సార్లు మాత్రమే విజయం సాధించి ట్రోఫీ గెలిచింది.
  Published by:John Naveen Kora
  First published: