IPL 2021 Final : ఫైనల్ కు ముందు కేకేఆర్ కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ పై వేటు..! కారణమిదే..

(Image Credit- Twitter/IPL)

IPL 2021 Final : కండ్ ఫేజ్ ఆరంభానికి ముందు ఏడో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... అద్బుత విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లి, కీలక మ్యాచుల్లో పూర్తి ఆధిపత్యం చూపించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్లో అడుగుపెట్టిన కోల్‌కతాకు బిగ్‌ షాక్ తగిలింది.

 • Share this:
  ఐపీఎల్ 2021 సీజన్‌ (IPL 2021 Season Latest Updates) రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌ థ్రిల్లర్ సినిమాను తలపించింది. వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) మెరుపులతో వన్‌సైడ్ అవుతుందనుకున్న మ్యాచ్ కాస్తా... ఒక్కసారిగా టర్న్ తిరిగి ఆఖరి ఓవర్ ఆఖరి రెండో బంతిదాకా నరాలు తెగే ఉత్కంఠను రేపింది. ఈ లో స్కోరింగ్ గేమ్‌లో అద్భుత విజయం అందుకున్న కోల్‌కత్తా (Kolkata Knight Riders), ఫైనల్‌కి దూసుకెళ్లింది. సెకండ్ ఫేజ్ ఆరంభానికి ముందు ఏడో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... అద్బుత విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లి, కీలక మ్యాచుల్లో పూర్తి ఆధిపత్యం చూపించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్లో అడుగుపెట్టిన కోల్‌కతాకు బిగ్‌ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కేకేఆర్‌ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌ (Dinesh Karthik)కు ఐపీఎల్‌ యాజమాన్యం జరిమానా విధించింది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 ఓవర్‌ వేసిన రబడా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యిన కార్తీక్‌.. అసహనానికి లోనై స్టంప్స్‌ను కొట్టి పెవిలియన్‌కు వెళ్లాడు.

  వాస్తవానికి మ్యాచ్ సమయంలో ఇలా ఆటగాళ్లు వికెట్లని తన్నడం, కొట్టడం లాంటివి చేస్తే..? అది క్రమశిక్షణరాహిత్యం కిందకి వస్తుంది. ఈ నేపథ్యంలో.. దినేశ్ కార్తీక్‌ క్రమశిక్షణ తప్పాడని నిర్ధారించిన మ్యాచ్ రిఫరీ క్రిస్ గఫానీ.. అతను లెవల్ 1 కింద తప్పిదానికి పాల్పడినట్లు తేల్చాడు. ఈ మేరకు దినేశ్ కార్తీక్‌ని రిఫరీ మందలించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనని విడుదల చేసింది. ఉత్కంఠగా ముగిసిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఒక బంతి మిగిలి ఉండగా కోల్‌కతా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కి చేరింది.

  " ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 అఫెన్స్ 2.2 రూల్ ప్రకారం కార్తీక్ చేసిన పని క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. అతడు నేరాన్ని అంగీకరించాడు. తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీపై ఆదారపడి ఉందని " ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే మ్యాచ్ రిఫరీ విధించే శిక్షకు కార్తీక్‌ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది.

  ఇది కూడా చదవండి : జట్టులోకి CSK స్టార్ ప్లేయర్.. భారత కొత్త జట్టు ఇదే..! ఆ ఆటగాడికి మరోసారి నిరాశే..

  ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ ఒక్క మ్యాచ్‌ నిషేదం కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కార్తీక్ తప్పును రిఫరీ సీరియస్‌గా తీసుకుంటే, ఫైనల్ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంది.

  ఇది కూడా చదవండి :పోలా.. అదిరిపోలా.. ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్‌పై టీమిండియా న్యూ జెర్సీ వెలిగిపోలా..!

  చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య శుక్రవారం రాత్రి 7.30 గంటలకి ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 2012, 2014లో ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. మూడో టైటిల్‌పై కన్నేయగా.. చెన్నై ఇప్పటికే మూడు సార్లు టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. కోల్ కతా ఫైనల్ చేరుకోవడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు కప్ నెగ్గింది. మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో టైటిల్ పై కన్నేసింది. గతేడాది ఘోర పరభవాన్ని తుడిచేస్తూ.. ఈ సారి కప్ కొట్టాలన్న లక్ష్యంతో బరిలోకి దిగనుంది ధోనీసేన.
  Published by:Sridhar Reddy
  First published: