IPL 2021: అక్కడి దరిద్రం మాకు చుట్టుకుంది.. కేదార్ జాదవ్‌ను ఘోరంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

కేదార్ జాదవ్‌ను ఘోరంగా ట్రోల్ చేస్తున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్ (PC: Hotstar Grab)

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో ఫ్యాన్స్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలో కేదార్ జాదవ్ పేలవ ప్రదర్శన వారిని మరింత ఆగ్రహానికి గురి చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

  • Share this:
    సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాడు కేదార్ జాదవ్‌పై (Kedar Jadav) ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అసలే ఐపీఎల్ 2021లో (IPL 2021) వరుస ఓటములతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు కేదార్ జాదవ్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎలాగో ఆడటం చేతగాదు.. పరుగులు చేయవు.. ఇక ఉన్న డీఆర్ఎస్‌లు ఎందుకు వేస్ట్ చేస్తున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు తరపున ఆడిన జాదవ్‌ను ఆ ఫ్రాంచైజీ విడుదల చేసింది. గత సీజన్‌లో యూఏఈలో జరిగిన ఐపీఎల్ సందర్భంగా కేదార్ జాదవ్ అత్యంత పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని వదిలించుకున్న చెన్నై.. తిరిగి కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపలేదు. ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కూడా కేదార్ జాదవ్‌ను తీసుకునే సాహసం చేయలేదు. కానీ సన్‌రైజర్స్ అతడిని ఏకంగా రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడే అభిమానులు అతడి కొనుగోలుపై తీవ్రంగా ట్రోల్స్ చేశారు.

    ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ తరపున ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా జాదవ్ ఆడలేకపోయాడు. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో కేదార్ జాదవ్ చేసింది 3 పరుగులే. ఎల్బీగా అవుటైతే అవుటయ్యాడని ఫ్యాన్స్ సరిపెట్టుకొని ఉండొచ్చు. అయితే కేదార్ జాదవ్ దానికి రివ్యూ తీసుకున్నాడు. ఎన్రిక్ నోకియా వేసిన బంతి మిడిల్ స్టంప్‌పై పడి నేరుగా వచ్చింది. జాదవ్ ఆడలేక ప్యాడ్లకు తగిలించుకున్నాడు. టీవీల్లో చూసిన వారికి కూడా అది అవుట్ అని స్పష్టంగా తెలిసింది. కానీ జాదవ్ దానికి రివ్యూ తీసుకున్నాడు. అతడు డీఆర్ఎస్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టీ20లో ఉండేదే ఒక రివ్యూ.. దాన్ని కూడా జాదవ్ వేస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Cristiano Ronaldo: సంపాదనలో మెస్సీని దాటేసిన క్రిస్టియానా రొనాల్డో.. అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 10 ఫుట్‌బాలర్స్ వీళ్లే
















    చెన్నై సూపర్ కింగ్స్ వదిలించుకునన దరిద్రం మాకు చుట్టు కుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. బంతి మిడిల్, లెగ్, ఆఫ్ స్టంప్‌లలో దేనికి తగిలిందో తెలుసుకోవడానికే జాదవ్ అలా రివ్యూ తీసుకున్నాడని సెటైర్లు వేస్తున్నారు. కనీసం బంతి ఎటు వెళ్తుందో కూడా అర్దం కావడం లేదా అని వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
    Published by:John Naveen Kora
    First published: