Home /News /sports /

IPL 2021: కృష్ణప్పా.. ఎంత పని చేసినావప్పా.. క్యాచ్ వదిలేయడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోలింగ్

IPL 2021: కృష్ణప్పా.. ఎంత పని చేసినావప్పా.. క్యాచ్ వదిలేయడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోలింగ్

క్యాచ్ వదిలేసిన కృష్ణప్ప గౌతమ్‌పై ఫుల్ ట్రోలింగ్ (PC; IPL)

క్యాచ్ వదిలేసిన కృష్ణప్ప గౌతమ్‌పై ఫుల్ ట్రోలింగ్ (PC; IPL)

IPL 2021: మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో కీలక క్యాచ్ వదిలేసిన చెన్నై ఆటగాడు కృష్ణప్ప గౌతమ్‌పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అతడిని ట్రోల్ చేస్తున్నారు.

    దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) - ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకే ఒక క్యాచ్ ఆట స్వరూపాన్నే మార్చేసింది. అప్పటి వరకు కాస్త చెన్నై వేపు ఉన్న మ్యాచ్.. ఏకంగా ఢిల్లీ వైపు మళ్లింది. అందుకే క్రికెట్ (Cricket) నిపుణులు 'క్యాచెస్ విన్ ది మ్యాచెస్' అని చెబుతుంటారు. ఢిల్లీ బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మెయర్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కృష్ణప్ప గౌతమ్ (Krishnappa Gowtham) జారవిడిచాడు. అది పెద్ద కష్టమైన క్యాచ్ (Catch) కూడా కాదు. గతంతో బౌండరీ లైన్ వద్ద ఎన్నో కష్టమైన క్యాచ్‌లు తీసుకున్న అనుభవం కృష్ణప్ప గౌతమ్‌కు ఉంది. కానీ ఆ సమయంలో మాత్రం బంతిని సరిగా అంచనా వేయలేక జారవిడిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో డ్వేన్ బ్రావో (Dwane Bravo) చాలా కీలకమైన ఆల్‌రౌండర్. గత కొన్ని సీజన్లుగా డెత్ వోవర్లలో ధోనికి నమ్మకమైన ఆల్‌రౌండర్‌గా ఉంటూ కీలక వికెట్లు తీసి విజయాలను అందించాడు. దీంతో సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా బ్రావోను 18వ ఓవర్‌లో బౌలింగ్‌కు తీసుకొని వచ్చాడు.

    బ్రావో బంతి అందుకునే సమయానికి స్ట్రైకింగ్ ఎండ్‌లో తమ దేశానికే చెందిన షిమ్రోన్ హెట్‌మెయర్ ఉన్నాడు. ఇద్దరూ గత కొంత కాలంగా కలసి క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఒకరి లోపాలు మరొకరికి తెలుసు. హెట్‌మెయర్ కంటే సీనియర్ అయిన బ్రావో అతడికి ఎలాంటి బంతి వేస్తే దొరికిపోతాడో తెలిసే బంతి విసిరాడు. అనుకున్నట్లుగానే హెట్‌మెయర్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి సరిగ్గా కృష్ణప్ప గౌతమ్ ఉన్న వైపే వెళ్లింది. కానీ బంతిని అందుకోలేక జారవిడవడంతో హెట్‌మెయర్ బతికి పోయాడు. అంతే కాకుండా ఆ బాల్ బౌండరీకి తగిలి నాలుగు పరుగులు కూడా వచ్చాయి. అక్కడి నుంచి మ్యాచ్ వేగం మారిపోయింది. హెట్‌మెయర్ వరుసగా బౌండరీలు కొడుతూ మ్యాచ్‌ను ఢిల్లీవైపు తిప్పేశాడు.

    IND vs PAK: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కు ఫుల్ క్రేజ్... యాడ్ రేటు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. హాట్ కేకుల్లా టికెట్లు















    ఇప్పుడు కృష్ణప్ప గౌతమ్ విడిచిన క్యాచ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 'గౌతమ్ నీకు ఇచ్చిందే ఒక పని.. అది కూడా సక్రమంగా చేయకపోతే ఎలా బ్రో' అని ఒకరు కామెంట్ చేయగా.. పంత్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడానికే గౌతమ్ ఇలా చేశాడని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్‌లో గౌతమ్ తుది జట్టులో లేడు. అతడు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చాడు. తనను తుది జట్టులో తీసుకోనందుకు కృష్ణప్ప ఇలా సీఎస్కేపై ప్రతీకారం తీర్చుకున్నాడంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి ఒక్క క్యాచ్ వదిలేసి సీఎస్కే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు కృష్ణప్ప గౌతమ్.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Chennai Super Kings, Delhi Capitals, IPL 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు