హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021: ఆ థర్డ్ అంపైర్‌ను పీకేయండి.. థర్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయం.. ఫీల్డ్ అంపైర్‌తో కేఎల్ రాహుల్ గొడవ

IPL 2021: ఆ థర్డ్ అంపైర్‌ను పీకేయండి.. థర్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయం.. ఫీల్డ్ అంపైర్‌తో కేఎల్ రాహుల్ గొడవ

థర్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయం.. ఫీల్డ్ అంపైర్‌తో కేఎల్ రాహుల్ గొడవ (PC: Video Grab)

థర్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయం.. ఫీల్డ్ అంపైర్‌తో కేఎల్ రాహుల్ గొడవ (PC: Video Grab)

IPL 2021: రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు - పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ నాటౌట్ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డీఆర్ఎస్‌లో స్పష్టంగా తెలుస్తున్నా థర్డ్ అంపైర్ నాటౌట్ ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా ఆదివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్ (Punjab Kings) - రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) మధ్య మ్యాచ్ జరిగింది. బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను (Devdutt Padikkal) నాటౌట్‌గా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. పంజాబ్ బౌలర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) ఇన్నింగ్స్ 8వ ఓవర్‌ వేస్తుండగా.. బ్యాటింగ్ చేస్తున్న దేవ్‌దత్ పడిక్కల్ లెగ్‌సైడ్ పడిన బంతిని కనెక్ట్ చేయలేక పోయాడు. అయితే బిష్ణోయ్, కీపర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అది కచ్చితంగా అవుట్ అని నమ్మి అప్పీల్ చేశారు. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ నాటౌట్ ఇచ్చాడు. కానీ కేఎల్ రాహుల్ డీఆర్ఎస్‌కు వెళ్లాడు. టీవీ అంపైర్ పలుమార్లు పరిశీలించిన అనంతరం ఆన్‌ఫీల్డ్ అంపైర్ డెషిషన్‌నే కన్ఫార్మ్ చేశాడు. అయితే టీవీ రీప్లేలో బంతి గ్లౌవ్‌కు తాకినట్లు చిన్న స్పైక్ వచ్చింది. అయినా సరే టీవీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంపై కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

  అవుటైనా సరే నాటౌట్‌గా ప్రకటించడంతో దేవ్‌దత్ పడిక్కల్ బతికిపోయాడు. అంతే కాకుండా పంజాబ్ కింగ్స్ ఉన్న ఏకైక రివ్యూ కూడా కోల్పోయింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ - అంపైర్ పద్మనాభన్ మధ్య చాలా సేపు తీవ్రమైన చర్చ జరిగింది. అంత క్లియర్‌గా స్పైక్ కనిపిస్తున్నా నాటౌట్ ఎలా ఇస్తారని నిలదీశాడు. ఇప్పుడు థర్డ్ అంపైర్ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. న్యూజీలాండ్ మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత స్కాట్ స్టైరిష్ 'థర్డ్ అంపైర్‌ను పీకేయండి.. ఏం జోక్' అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు. అతడితో కలసి మరి కొంత మంది పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అది అవుట్ కాదా? అని కొంత మంది ట్వీట్ చేస్తుండగా.. మరో వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా.. 'అదెలా అవుట్ కాదు' అంటూ ప్రశ్నిస్తున్నాడు. మొత్తానికి డీఆర్ఎస్‌లో చూసి కూడా కరెక్ట్ డెషిషన్ చెప్పలేకపోయాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

  IPL 2021: కొడితే కెమేరా పగిలిపోయింది.. నితీశ్ రాణా షాట్‌కు మూవింగ్ రోబో కెమేరా ఎలా పగిలిందో చూడండి  ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.

  Published by:John Kora
  First published:

  Tags: IPL 2021, Punjab kings, Royal Challengers Bangalore

  ఉత్తమ కథలు