IPL 2021-Eliminator: కోల్‌కతాతో చావో రేవో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు.. ఇవే తుదిజట్లు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు.. ఇవే తుది జట్లు (PC: IPL)

IPL 2021-Eliminator: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం రాత్రి షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా, బెంగళూరు తుది జట్ల వివరాలు ఇవే.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా షార్జా క్రికెట్ స్టేడయంలో సోమవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) - కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ (Virat Kohli) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చావో రేవో లాంటిదే. ఈ మ్యాచ్‌లో కనుక ఓడిపోతే ఇక ఐపీఎల్ 2021 ప్రయాణం ముగిసినట్లే, గెలిచిన జట్టు బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌లో క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆడనున్నది. 'ఈ వికెట్ చాలా బాగా కనపడుతున్నది. బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా కనపడుతున్నది. మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ షార్జాలో బ్యాటింగ్ చేయడం కష్టం అవుతుంది. అందుకే ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాను. గత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. జట్టుకు భరత్ అందిస్తున్న పరుగులను బట్టి చాలా సంతోషంగా ఉన్నది. అతడు త్వరగా మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడు' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

    టాస్ ఓడినా.. మేం ఏం చేయాలనుకున్నామో అదే మాకు దక్కింది. ముందుగా బౌలింగ్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉన్నది. టాస్ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా జట్టు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాము. ఈ మ్యాచ్ గెలిచి తప్పకుండా క్వాలిఫయర్ లోకి అడుగుపెడతామని అనుకుంటున్నాము అని కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు.











    ఇరు జట్లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. అయితే కేకేఆర్ జట్టులో బౌలింగ్ బలంగా ఉండగా.. ఆర్సీబీలో బ్యాటింగ్ చాలా బలంగా ఉన్నది. మరి ఆర్సీబీ భారీ టార్గెట్ సెట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
    Published by:John Naveen Kora
    First published: