• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 DUE TO THIS PLAYER MISTAKE CORONA SPREAD IN KOLKATA KNIGHT RIDERS TEAM SRD

IPL 2021 : కోల్ కతా ఆటగాళ్లకు కరోనా రావడానికి కారణం ఆ ప్లేయర్ నిర్లక్ష్యమేనా..?

IPL 2021 : కోల్ కతా ఆటగాళ్లకు కరోనా రావడానికి కారణం ఆ ప్లేయర్ నిర్లక్ష్యమేనా..?

IPL 2021 : కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, మిస్టరీ లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా అధికారికంగా ధృవీకరించింది. అయితే అత్యంత కఠినమైన బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడం పలు అనుమానాలకు తావిస్తోంది.

  • Share this:
    భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం చాలా రంగాలపై పడింది. క్రీడా రంగంపై కూడా కరోనా ప్రభావం చాలానే ఉంది. లేటెస్ట్ గా కరోనా ప్రభావంతో ఐపీఎల్ 2021 సీజన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, మిస్టరీ లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా అధికారికంగా ధృవీకరించింది. అయితే అత్యంత కఠినమైన బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు బబుల్‌లోకి వైరస్ ఎలా ప్రవేశించిందనే విషయం అంతుపట్టడంలేదు. బీసీసీఐ కఠిన ప్రొటోకాల్స్ నేపథ్యంలో బయో బబుల్‌లోకి వైరస్ ప్రవేశించడం దాదాపు అసాధ్యం. అసలు ఈ లీగ్‌లో పాలుపంచుకునే మైదాన సిబ్బంది నుంచి టీవీ క్రూ, హోటల్ సిబ్బంది వరకు అందరూ కఠిన బబుల్‌లోనే ఉంటారు. అలాంటప్పుడు వైరస్ ఎలా వచ్చిందనేది ఎవరికి అర్థం కావడం లేదు. అయితే వరుణ్ చక్రవర్తి బయో బబుల్ దాటినట్లు ప్రచారం జరుగుతోంది. భుజ గాయానికి స్కానింగ్ తీసేందుకు వరుణ్ బబుల్ వీడి ఆసుపత్రికి వెళ్లినట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో పేర్కొంది. అక్కడే అతనికి వైరస్ సోకినట్లుందని ప్రచారం జరుగుతుంది. ఇక బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో గత నాలుగు రోజుల్లో చేసిన మూడో పరీక్షల్లో వరుణ్‌, సందీప్ వారియర్‌కు పాజిటీవ్ వచ్చినట్లు పేర్కొంది.

    దీంతో ఈ ఇద్దరిని ఐసోలేషన్‌కు తరలించినట్లు స్పష్టం చేసింది. వైద్యుల బృందం నిరంతరం వారిని పర్యవేక్షిస్తుందని, వారితో సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లను కూడా వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపింది. వరుణ్ చక్రవర్తి కేకేఆర్ జట్టుతో కలిసి ఉండటంతో వైరస్ ఎంతమందికి వ్యాప్తి చెందిందనే ఆందోళన అందరి నెలకొంది. అంతేకాకుండా కేకేఆర్ తన చివరి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌ తర్వాత వరుణ్ చక్రవర్తి ఢిల్లీ ఆటగాళ్లతో సన్నిహితంగా మెదిలాడు. ఇప్పుడు వాళ్లు కూడా డేంజర్‌జోన్‌లో పడ్డారు. ఈ ఇద్దరి నుంచి వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటే మాత్రం లీగ్ అర్ధాంతరంగా వాయిదా పడే అవకాశం ఉంది.

    మరోవైపు, ఇప్పటికే చెన్నై జట్టులో కూడా కరోనా కలకలం రేపింది. బౌలింగ్ కోచ్ లక్ష్మిపతి బాలజీ తో పాటు సీఈవో కాశీనాథన్ కూడా కరోనా బారిన పడ్డారు. అలాగే ఢిల్లీ గ్రౌండ్ స్టాఫ్ లో ఐదుగురి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ పరిస్థితుల్లో కరోనా ఎలా నిర్వహిస్తారని.. బీసీసీఐ కి అనేక ప్రశ్నలు మొదలయ్యాయ్. ఇంత, తీవ్ర వ్యతిరేకతో ఐపీఎల్ ఎలా నిర్వహించనున్నది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
    Published by:Sridhar Reddy
    First published: