హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 : జస్ట్ మిస్.. నాలుగు రోజులు లేట్ అయింది..లేకపోతే కరోడ్‌పతి అయ్యేవాడు...

IPL 2021 : జస్ట్ మిస్.. నాలుగు రోజులు లేట్ అయింది..లేకపోతే కరోడ్‌పతి అయ్యేవాడు...

Devon Conway (Photo Credit : Twitter)

Devon Conway (Photo Credit : Twitter)

IPL 2021: ఈ ఏడాది ఐపీఎల్ వేలం హాట్ హాట్ గా సాగింది. కొంత మంది ప్లేయర్లు జాక్ పాట్ కొట్టారు. మరి కొంత మందికి అసలు ఛాన్సే రాలేదు. ఫ్రాంఛైజీల వ్యూహాలేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఆట, నైపుణ్యాన్ని బట్టి కాకుండా.. అదృష్టాన్ని బట్టే ఆటగాళ్లకు ధర పలికింది.

ఇంకా చదవండి ...

ఈ ఏడాది ఐపీఎల్ వేలం హాట్ హాట్ గా సాగింది. కొంత మంది ప్లేయర్లు జాక్ పాట్ కొట్టారు. మరి కొంత మందికి అసలు ఛాన్సే రాలేదు. ఫ్రాంఛైజీల వ్యూహాలేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఆట, నైపుణ్యాన్ని బట్టి కాకుండా.. అదృష్టాన్ని బట్టే ఆటగాళ్లకు ధర పలికింది. అసలు ఫ్రాంఛైజీలు క్రికెట్ ఆడటానికి ప్లేయర్లను కొనుక్కుంటున్నాయా.. లేకపోతే డబ్బుతో జూదమాడుతున్నాయా అనేది అర్థం కాని పరిస్థితి.

అయితే, ఇక్కడ ఒక ఆటగాడికి మంచి చాన్స్‌ మిస్సయ్యిందనే చెప్పాలి. న్యూజిలాండ్‌కు చెందిన ఎడమచేతి వాటం ఆటగాడు డేవాన్‌ కాన్వే రోజుల వ్యవధిలో ఐపీఎల్‌ ఆడే అవకాశాన్ని కోల్పోవడమే కాదు.. కోట్ల రూపాయల్ని సంపాదించే అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడనే చెప్పాలి. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఇందుకు కారణం కాన్వే ఒక సూపర్‌ నాక్‌తో ఆసీస్‌ను చిత్తుచేయడమే. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో కాన్వే చెలరేగి ఆడాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో​ 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అయితే, ఇటీవల ముగిసిన వేలంలో ఈ ఆటగాడు అమ్ముడుపోలేదు. అతని కనీస ధర 50 లక్షల రూపాయలు ఉన్నా ఎవరూ తీసుకోలేదు. అయితే ఆసీస్‌తో ఆడిన ఇన్నింగ్స్‌ ముందే వచ్చుంటే విషయాన్ని అశ్విన్‌ ప్రస్తావించాడు. "నాలుగు రోజులు లేటైంది.. కానీ వాటే నాక్‌" అని ట్వీట్‌ చేశాడు. ఒకవేళ వేలానికి ముందు కాన్వే ఈ తరహా సంచలన ఇన్నింగ్స్‌ ఏమైనా చేసి ఉంటే కోట్లలో అమ్ముడుపోయేవాడు. ఐదు ట్వంటీ20ల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆల్ రౌండ్ షోతో ఆస్ట్రేలియా మట్టికరిపించింది.

ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన బ్లాక్‌క్యాప్స్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేయగా, ఆపై ఆసీస్‌ 17.3 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో కివీస్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అయితే, కివీస్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు గప్టిల్‌(0), సీఫెర్ట్‌(1)లు ఇద్దరూ నిరాశపరిచారు. అనంతరం కెప్టెన్‌ విలియమ్సన్‌(12) కూడా ఆకట్టుకోలేదు. కానీ తన కెరీర్‌లో ఏడో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న కాన్వే రెచ్చిపోయి ఆడాడు. కివీస్‌ను కష్టాల్లోంచి గట్టెక్కించడమే కాదు.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు కాన్వే అత్యధిక టీ20 స్కోరు 65గా ఉంది. సూపర్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ గెలిపించిన కాన్వేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

First published:

Tags: IPL 2021, T20 Auction 2021

ఉత్తమ కథలు