Home /News /sports /

IPL 2021 DELHI CAPITALS SKIPPER RISHABH PANT AND PRITHVI SHAW CRIES AFTER LOSING KOLKATA KNIGHT RIDERS IN QUALIFIER 2 SRD

IPL 2021 : దేవుడా.. మాకే ఎందుకిలా జరుగుతోంది..! ఓటమి తట్టుకోలేక ఏడ్చేసిన పంత్, పృథ్వీ షా..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

IPL 2021 : ఇక, ఈ సీజన్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కు నిరాశ తప్పలేదు. గత మూడేళ్లుగా టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న ఢిల్లీకి ఈ సారి కూడా కలిసి రాలేదు.

  ఐపీఎల్ 2021 సీజన్‌ (IPL 2021 Season Latest Updates) రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌ థ్రిల్లర్ సినిమాను తలపించింది. వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) మెరుపులతో వన్‌సైడ్ అవుతుందనుకున్న మ్యాచ్ కాస్తా... ఒక్కసారిగా టర్న్ తిరిగి ఆఖరి ఓవర్ ఆఖరి రెండో బంతిదాకా నరాలు తెగే ఉత్కంఠను రేపింది. ఈ లో స్కోరింగ్ గేమ్‌లో అద్భుత విజయం అందుకున్న కోల్‌కత్తా (Kolkata Knight Riders), ఫైనల్‌కి దూసుకెళ్లింది. సెకండ్ ఫేజ్ ఆరంభానికి ముందు ఏడో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... అద్బుత విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లి, కీలక మ్యాచుల్లో పూర్తి ఆధిపత్యం చూపించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక, ఈ సీజన్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కు నిరాశ తప్పలేదు. గత మూడేళ్లుగా టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న ఢిల్లీకి ఈ సారి కూడా కలిసి రాలేదు. టోర్నీ అసాంతం దుమ్మురేపిన పంత్ సేన.. కీలక రెండు మ్యాచ్ ల్లో చేతులేత్తేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకున్న ఢిల్లీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లోనూ ఓటమిపాలైంది.

  గెలుపు కోసం చివరివరకు పోరాడిన ఢిల్లీకి నిరాశే ఎదురైంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్, ఓపెనర్ పృథ్వీ షా ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. గత మూడేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబర్చినా టైటిల్ అందుకోకపోవడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు సైతం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాడ్ లక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. బెటర్ లక్ నెక్ట్స్ టైం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్లకు 135 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్(27 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 30 నాటౌట్), శిఖర్ ధావన్(39 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు తీయగా.. ఫెర్గూసన్, శివం మావి తలో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు చేసి ఓ బంతి మిగిలుండగానే గెలుపొందింది.


  వెంకటేశ్ అయ్యర్(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా..శుభ్‌మన్ గిల్ (46 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్, కగిసో రబడా, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.ఓపెనర్లిద్దరు తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో ఓ దశలో కేకేఆర్ సునాయసంగా గెలుస్తుందనిపించింది.


  కానీ రబడా వేసిన 18వ ఓవర్‌లో ఓ వికెట్ తీసి 1 పరుగు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి 12 బంతుల్లో కేకేఆర్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. అన్రిచ్ నోర్జ్ వేసిన 19వ ఓవర్‌లో మూడు పరుగులిచ్చే ఓ వికెట్ తీయడంతో మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ వైపు మళ్లీంది. చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా.. బంతిని అందుకున్న అశ్విన్ వరుసగా రెండు వికెట్లు తీశాడు. దాంతో చివరి రెండు బంతులకు కేకేఆర్ విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే రాహుల్ త్రిపాఠి భారీ సిక్సర్ కొట్టడంతో కేకేఆర్ విజయం లాంఛనమైంది.

  ఇది కూడా చదవండి : వామ్మో.. బుమ్రాలో ఈ యాంగిల్ కూడా ఉందా.. హోటల్ రూంలో భార్య సంజనాతో సరసాలు..

  ఈ విక్టరీతో చెన్నైతో శుక్రవారం జరిగే ఫైనల్ లో అమీతుమీ తేల్చుకోనుంది. కోల్ కతా ఫైనల్ చేరుకోవడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు కప్ నెగ్గింది. మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో టైటిల్ పై కన్నేసింది. గతేడాది ఘోర పరభవాన్ని తుడిచేస్తూ.. ఈ సారి కప్ కొట్టాలన్న లక్ష్యంతో బరిలోకి దిగనుంది ధోనీసేన.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Delhi Capitals, IPL 2021, Kolkata Knight Riders, Prithvi shaw, Rishabh Pant, Viral Video

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు