హోమ్ /వార్తలు /క్రీడలు /

Prithvi Shaw: ఏంటి షా గారు ఈ అరాచకం.. పృథ్వీ బ్యాటింగ్ పై నెట్టింట్లో పేలుతున్న జోకులు..

Prithvi Shaw: ఏంటి షా గారు ఈ అరాచకం.. పృథ్వీ బ్యాటింగ్ పై నెట్టింట్లో పేలుతున్న జోకులు..

ఏంటి  షా గారు ఈ అరాచకం.. పృథ్వీ బ్యాటింగ్ పై నెట్టింట్లో పేలుతున్న జోకులు..

ఏంటి షా గారు ఈ అరాచకం.. పృథ్వీ బ్యాటింగ్ పై నెట్టింట్లో పేలుతున్న జోకులు..

Prithvi Shaw: పృథ్వీ బ్యాటింగ్‌లో మెరవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గతంలో అతడిని విమర్శించిన వారిపై మీమ్స్ రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

కరోనా వేళ క్రికెట్ అభిమానులు ఇళ్లలోనే ఉంటూ ఐపీఎల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం లీగ్‌లో రోజుకు ఒకరు మెరుస్తున్నారు. గురువారం గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా విశ్వరూపం చూపాడు. గత కొన్ని మ్యాచ్‌లలో అతడు తీవ్రంగా విఫలమయ్యాడు. దీంతో సీనియర్లు అతడి ఆట తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు విమర్శకుల నోళ్లు మూయించాలా అన్నట్లు పృథ్వీ వేచి చూశాడు. తాజా మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్లో.. ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి రికార్డు సాధించాడు. ఈ ఓపెనర్‌ బ్యాటింగ్‌లో ప్రతాపం చూపడంతో కోల్‌కత నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ సులువుగా ఛేదించింది. పృథ్వీ బ్యాటింగ్‌లో మెరవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గతంలో అతడిని విమర్శించిన వారిపై మీమ్స్ రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

కోల్‌కత పేసర్ శివం మావి వేసిన మొదటి ఓవర్లో పృథ్వీ ఏకంగా 24 పరుగులు సాధించాడు. ఈ ఓవర్‌లో గ్రౌండ్ నలుమూలలా ఫోర్లు బాదాడు. మొత్తం ఆరు ఫోర్లు, ఒక వైడ్‌ కలిపి ఫస్ట్ ఓవర్లోనే 25 పరుగులు సాధించాడు. తద్వారా ఐపీఎల్‌లో ఒక ఓవర్‌లో ఆరు ఫోర్లు కొట్టిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు. ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇది వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్‌లో అతడికి ఇది తొమ్మిదో యాభై. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పృథ్వీ 41 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తన ఆటతీరుపై గతంలో కొందరు మాజీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఇప్పుడు ఢిల్లీ అభిమానులు వీరిపై జోక్స్, మీమ్స్ రూపొందిస్తున్నారు.

ఒక అభిమాని పృథ్వీని కేజీఎఫ్‌ టీజర్‌లో కనిపించే హీరోలా చూపించాడు. ‘ఢీ’ సినిమాలో వినిపించే.. ‘ఏంటి చారీగారు ఈ అరాచకం’ అనే మీమ్‌ను ఒక తెలుగు అభిమాని పోస్ట్ చేశాడు. బాలీవుడ్, ఇతర భాషల్లోని సినిమాల్లో ఫన్నీ డైలాగ్‌లను మీమ్ క్రియేటర్లరు తయారు చేశారు. ఇప్పుడు ఇవి ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి.

First published:

Tags: Delhi Capitals, IPL 2021, Kolkata Knight Riders, Prithvi shaw, Rishabh Pant

ఉత్తమ కథలు