• HOME
 • »
 • NEWS
 • »
 • SPORTS
 • »
 • IPL 2021 DELHI CAPITALS HEAD COACH RICKY PONTINGS ROARING SPEECH GOES VIRAL IN SOCIAL MEDIA SRD

IPL 2021 : టైటిల్ గెలిచేందుకే ఇక్కడికి వచ్చాం..రోమాలు నిక్కబొడిచేలా పాంటింగ్ స్పీచ్..

IPL 2021 : టైటిల్ గెలిచేందుకే ఇక్కడికి వచ్చాం..రోమాలు నిక్కబొడిచేలా పాంటింగ్ స్పీచ్..

రికీ పాంటింగ్

IPL 2021 : గతేడాది ఆఖరి మెట్టుపై బోల్తాపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఈ సారి ఎలాగైనా కప్ కొట్టి.. విజయ కేతనం ఎగురవేయాలన్న కసితో ఉంది. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ (Ricky Ponting) చేసిన స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

 • Share this:
  క్రికెట్ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్ లో ఎలాగైనా కప్ గెలవాలన్న కసి అన్ని టీమ్స్ ల్లో కన్పిస్తోంది. ఈ సీజన్ కోసం ఐపీఎల్ టీమ్స్ అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటాయ్. ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా వినూత్నంగా ప్రాక్టీస్ చేస్తూ.. దూసుకుపోతున్నాయ్. ఇక, గతేడాది ఆఖరి మెట్టుపై బోల్తాపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ఎలాగైనా కప్ కొట్టి.. విజయ కేతనం ఎగురవేయాలన్న కసితో ఉంది. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ చేసిన స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. టైటిల్ నెగ్గేందుకే ఇక్కడికి వచ్చామని ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) హెడ్ కోచ్..ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (Ricky Ponting) తమ ఆటగాళ్లకు స్పష్టం చేశాడు. ఇప్పటి క్వారంటైన్ రూల్స్ పూర్తి చేసుకున్న రికీ పాంటింగ్.. ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించాడు. ఆ తర్వాత ఆటగాళ్లలో స్పూర్తిని రగిల్చే స్పీచ్ ఇచ్చాడు. "ఇది మీ టీమ్" అని, గత రెండు సీజన్లు బాగానే గడిచినా.. టైటిల్ గెలవలేకపోయామని, ఈ సారి చాంపియన్ అవ్వడమే లక్ష్యమని స్పష్టం చేశాడు. కొత్త సారిథి రిషభ్ పంత్‌ను ప్రస్తావిస్తూ కష్టపడే ఆటగాళ్లతో తాను బాగానే ఉంటానన్నాడు. ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. " ఢిల్లీ క్యాపిటల్స్ 2021 టీమ్‌ను ఫస్ట్ టైమ్ రికీ పాంటింగ్ కలిశాడు. అతని మోటివేషనల్ స్పీచ్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అందుకే ఈ వీడియోను మీతో పంచుకుంటున్నాం " అని ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్షన్‌గా పేర్కొంది.

  నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్న ఆటగాళ్లను పాంటింగ్ ఎంకరేజ్ చేశాడు. " కుర్రాళ్లందరికి స్వాగతం. ఈ రోజు ఇదే మన ఫస్ట్ ట్రైనింగ్ సెషన్. కొంచెం ఆలస్యమైంది. ఇప్పటికే మీ ప్రాక్టీస్ గురించి ప్రవీణ్, మహ్మద్ కైఫ్‌లతో మాట్లాడాను. నెట్స్‌లో మీరు కష్టపడుతున్న తీరును వారు నాకు చెప్పారు. మీ ప్రిపరేషన్ ఇప్పటి వరకు అద్భుతంగా సాగింది. ఇక్కడ కొంత మంది కుర్రాళ్లకు నా గురించి తెలియకపోవచ్చు. నాది మెల్‌బోర్న్. వయసు 46 ఏళ్లు. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. గత మూడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా పనిచేస్తున్నాను. నేను బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాది మేం ఆఖరి స్థానంలో నిలిచాం. రెండేళ్ల క్రితం మూడో స్థానంతో సరిపెట్టుకున్నాం. గతేడాది రన్నర్‌గా నిలిచాం. గత సీజన్లలోని జట్టు కన్నా ఈ ఢిల్లీ టీమ్ ప్రత్యేకమైనది. నేను చెప్పేది కరెక్టే కదా? ఫ్రాంచైజీ మిమ్మల్ని తీసుకొచ్చింది నా గురించి కాదు. కోచ్‌ల కోసం కాదు. మీకోసమే. నేను చెప్పేది వాస్తవమేనా? ఇది మీ జట్టు. నయా కెప్టెన్ రిషభ్ పంత్ ఇది నీ టీమ్.


  ఐపీఎల్ టైటిల్ గెలవడానికి మనం ఓ అడుగు ముందుకు వేస్తున్నాం. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. టైటిల్ గెలిచేందుకే నేను ఇక్కడ ఉన్నాను. గత సీజన్‌లో దగ్గరగా వచ్చి అవకాశాన్ని చేజార్చుకున్నాం. గత రెండు సీజన్లు మనకు బాగానే గడిచాయి. కానీ గొప్పవి మాత్రం కాదు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. మేం నెట్స్‌లో ఆటగాళ్లను వదిలేయం ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. మాకు పర్ఫెక్ట్ అనిపించేవరకు ప్రాక్టీస్ సెషన్ కొనసాగిస్తాం. అది గంట లేదా, రెండు, మూడు గంటలు కూడా జరగవచ్చు. ఇక నా కోచింగా చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు సరైన అటిట్యూడ్‌తో ముందుకు సాగుతూ.. కమిట్‌మెంట్‌తో కష్టపడితే మీతో నేను బాగుంటా. సరేనా? రాబోయే రెండు నెలలు అవే మన టీమ్ విలువలవుతాయి " అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. రేపటి నుంచి 2021 సీజన్‌కు తెరలేవనుంగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఫస్ట్ మ్యాచ్ శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది.
  Published by:Sridhar Reddy
  First published: