• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 DC VS RCB LIVE UPDATES ROYAL CHALLENGERS BANGALORE WON BY JUST ONE RUN SRD

DC vs RCB : వాటే మ్యాచ్.. వాటే మ్యాచ్.. ఒక పరుగు తేడాతో RCB విక్టరీ.. మహ్మద్ సిరాజే హీరో...

DC vs RCB : వాటే మ్యాచ్.. వాటే మ్యాచ్.. ఒక పరుగు తేడాతో RCB విక్టరీ.. మహ్మద్ సిరాజే హీరో...

DC vs RCB : వాటే మ్యాచ్.. వాటే మ్యాచ్.. ఒక పరుగు తేడాతో RCB విక్టరీ.. మహ్మద్ సిరాజే హీరో...

DC vs RCB : ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇచ్చింది. ఆఖరి వరుకూ రెండు జట్లు పోరాడాయ్. కానీ, చివరికి విజయం మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరునే వరించింది.

  • Share this:
    నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ కొట్టింది. ఒక పరుగు తేడాతో ఢిల్లీపై విజయం దక్కించుకుంది. ఆఖరి వరకు జరిగిన ఈ నైల్ బైటింగ్ ఫైట్ లో మహ్మద్ సిరాజే హీరోగా నిలిచాడు. ఆఖరి ఓవర్ లో 14 పరుగులు అవసరం కాగా.. తన అద్భుత బౌలింగ్ తో ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంత్, హెట్ మేయర్ పోరాటం వృథా అయింది. హెట్ మేయర్ 25 బంతుల్లో 53 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడగా.. పంత్ 48 బంతుల్లో 58 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. 7 పరుగులు చేసి సూపర్ ఫామ్ లో ఉన్న గబ్బర్ శిఖర్ ధావన్ కైల్‌ జేమిసన్‌ బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే స్మిత్ కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ కు చేరాడు. 5 బంతుల్లో 4 పరుగులు చేసిన స్మిత్.. సిరాజ్ బౌలింగ్ లో డివిలియర్స్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత 21 పరుగులు చేసిన పృథ్వీ షా హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత స్టొయినిస్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు పంత్. వీరిద్దరూ సమన్వయంగా ఆడుతూ.. స్కోరు బోర్డును ముందుకు కదిలించారు.

    అయితే 22 పరుగులు చేసిన స్టొయినిస్.. నాలుగో వికెట్ గా పెవిలియన్ బాట పట్టాడు. హర్షల్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ నాలుగో బంతికి స్టొయినిస్‌ డివిలియర్స్‌కు క్చాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత పంత్ తో కలిసిన హెట్ మేయర్ రెచ్చిపోయాడు. ముఖ్యంగా జేమీసన్ వేసిన 17 వ ఓవర్ లో మూడు సిక్సర్లతో 21 పరుగులు పిండుకున్నాడు. దీంతో మ్యాచ్ ఢిల్లీ సైడ్ టర్న్ అయింది. కానీ, ఆఖర్లో సిరాజ్ సూపర్ బౌలింగ్ తో ఆర్సీబీని విజయం వరించింది.

    అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు టఫ్ టోటల్ సెట్ చేసింది. ఏబీ డివిలియర్స్(42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 నాటౌట్) పరుగుల విధ్వంసం సృష్టించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 172 పరుగుల టఫ్ టార్గెట్ ఉంచింది. ఏబీడీకి తోడుగా.. యువ ప్లేయర్ పటిదార్(22 బంతుల్లో 2 సిక్స్‌లతో 31), గ్లేన్ మ్యాక్స్‌వెల్(20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 25) సత్తా చాటడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 రన్స్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అవేశ్ ఖాన్, రబడా, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. మార్కస్ స్టోయినిస్ వేసిన చివరి ఓవర్‌లోనే ఏబీడీ మూడు సిక్సర్లతో 23 పరుగుల పిండుకున్నాడు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ మరోసారి నిరాశపర్చారు.
    Published by:Sridhar Reddy
    First published: