• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 DC VS RCB LIVE UPDATES ROYAL CHALLENGERS BANGALORE SETS FIGHTING TOTAL ON BOARD SRD

DC vs RCB : మరోసారి డివిలియర్సే ఆపద్భాందువుడు.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..

DC vs RCB : మరోసారి డివిలియర్సే ఆపద్భాందువుడు.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..

DC vs RCB : మరోసారి డివిలియర్సే ఆపద్భాందువుడు.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..

DC vs RCB : టాప్ ప్లేస్ కోసం జరుగుతున్న సమరంలో ఆర్సీబీ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ మరోసారి బెంగళూరు టీమ్ ను ఆదుకున్నాడు.

  • Share this:
    నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మరోసారి కోహ్లీసేనను ఏబీ డివిలియర్స్ ఆదుకున్నాడు. డివిలియర్స్ 42 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లు తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం లభించలేదు. వరుస ఓవర్లలో ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తొలుత 12 పరుగులు చేసిన కోహ్లి ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరగ్గా.. 17 పరుగులు చేసిన పడిక్కల్‌ ఇషాంత్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత మ్యాక్స్ వెల్ తన బ్యాట్ కు పని చెప్పాడు. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. అయితే జోష్ మీదున్న మ్యాక్సీని అమిత్ మిశ్రా బోల్తా కొట్టించాడు. 20 బంతుల్లో25 పరుగులు చేసిన మ్యాక్స్ వెల్.. అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ 60 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

    మ్యాక్స్‌వెల్‌ అవుటైన తర్వాత పాటిధార్‌, డివిలియర్స్‌ నిలకడగా ఆడారు. ఇద్దరి మధ్య 54 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదైంది. అయితే, మంచి షాట్లతో అలరించిన పాటిధార్ ను అక్షర్ పెవిలియన్ కు పంపాడు. 22 బంతుల్లో 31 పరుగులు చేసిన పాటిధార్ అక్షర్ బౌలింగ్ లో స్మిత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ షో మొదలైంది. మంచి బంతుల్ని గౌరవిస్తూ..బ్యాడ్ డెలివరీలను బౌండరీలకు తరలిస్తూ రెచ్చిపోయాడు మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్. ఆఖరి ఓవరిలో అయితే ఏకంగా తన విశ్వరూపం చూపించాడు. స్టొయినిస్ వేసిన ఆ ఓవర్ లో ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు.

    ఇక, ఐపీఎల్ లో హెడ్ టు హెడ్ రికార్డులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే అనుకూలంగా ఉన్నాయ్. ఇందులో బెంగళూరు టీమ్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 10 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
    Published by:Sridhar Reddy
    First published: