DC vs RCB : పంత్ వర్సెస్ కోహ్లీ..టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..కీలక మార్పులతో బరిలోకి రెండు జట్లు..

DC vs RCB : పంత్ వర్సెస్ కోహ్లీ..టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..కీలక మార్పులతో బరిలోకి రెండు జట్లు..

DC vs RCB : ఐదు మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, ఒక పరాజయం. ఇది ఢిల్లీ, బెంగళూరు జట్ల పరిస్థితి. ఈ మ్యాచ్ లో గెలిస్తే టాప్ ప్లేస్. దీంతో హోరాహోరీ పోరు సాగడం ఖాయం. ఈ సూపర్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • Share this:
  ఐపీఎల్ 2021 సీజన్ లో మరికాసేపట్లో అసలు సిసలు సమరం ప్రారంభం కానుంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రెండు స్ట్రాంగ్ టీమ్ లు అమీతుమీ తేల్చుకోనున్నాయ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లో తలపడనున్నాయ్. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ మీద సూపర్ ఓవర్ గెలిచిన కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగనుంది ఢిల్లీ క్యాపిటల్స్. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడి.. తొలి ఓటమి రుచి చూసిన బెంగళూరు తిరిగి గాడిలో పడాలనే పట్టుదలతో ఉంది. ఏదేమైనా సమ ఉజ్జీలా కనిపిస్తున్నా ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పదు. బెంగళూరు టీమ్‌లో ఓపెనర్ దేవదత్ పడిక్కల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. చెన్నైతో మ్యాచ్‌లో ఆ జట్టు మిడిలార్డర్ డొల్లతనం బయట పడింది. గ్లెన్ మ్యాక్స్ వెల్, ఏబీ డివిలియర్స్ కూడా ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఇక వాషింగ్టన్ సుందర్, డేనియల్ క్రిస్టియాన్ తమ ఆల్‌రౌండర్‌ పాత్రకి న్యాయం చేయలేకపోతున్నారు. మొత్తంగా.. కోహ్లీ, పడిక్కల్, మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్‌ ప్రదర్శనపైనే బెంగళూరు అతిగా ఆధారపడుతోంది. ఆ జట్టు గెలవాలంటే.. ఈ నలుగురిలో కనీసం ఇద్దరు క్లిక్ కావాల్సి ఉంది. ఇక, బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ ఆరంభంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తన బౌన్సర్, షార్ట్ పిచ్, ఆఫ్ కట్టర్స్‌తో ఇబ్బంది పెడుతున్నాడు. ఇక స్పిన్నర్లు చాహల్, వాషింగ్టన్ సుందర్ కాస్త పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నా మ్యాచ్‌లను మలుపు తిప్పే ప్రదర్శన కనబర్చడం లేదు.

  మరోవైపు, ఢిల్లీకి ఎలాంటి సమస్యల్లేవు. ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా సూపర్ ఫామ్‌లో ఉండగా స్మిత్, కెప్టెన్ పంత్ వీరికి అండగా నిలుస్తున్నారు. మిడిలార్డర్ సమస్య మాత్రం ఆ జట్టును వెంటాడుతుంది. హెట్‌మైర్, మార్కస్ స్టాయినిస్ ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ చేయలేదు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతంగా మారింది. బౌలింగ్‌లో పేసర్ అవేష్ ఖాన్ అదరగొడుతుండగా.. కగిసో రబాడ మాత్రం చివర్లో ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. అయితే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోవడం ఆ జట్టుకు పెద్ద లోటుగా మారింది.

  ఇక, ఐపీఎల్ లో హెడ్ టు హెడ్ రికార్డులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే అనుకూలంగా ఉన్నాయ్. ఇందులో బెంగళూరు టీమ్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 10 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

  తుది జట్లు :


  Royal Challengers Bangalore (Playing XI): Virat Kohli(c), Devdutt Padikkal, Rajat Patidar, Glenn Maxwell, AB de Villiers(w), Washington Sundar, Daniel Sams, Kyle Jamieson, Harshal Patel, Yuzvendra Chahal, Mohammed Siraj
  Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Rishabh Pant(w/c), Steven Smith, Shimron Hetmyer, Marcus Stoinis, Axar Patel, Amit Mishra, Kagiso Rabada, Ishant Sharma, Avesh Khan


  Published by:Sridhar Reddy
  First published: